రికార్డు స్థాయిలో.. ప్రభాస్ బిల్లా సినిమా రీ రిలీజ్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, చిరంజీవి ఘరానా మొగుడు, పవన్ కళ్యాణ్ జల్సా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా 4k వెర్షన్తో ఈనెల 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Billa 4K: యూఎస్‌లో రికార్డ్ స్థాయిలో..

ఇకపోతే ఈ సినిమా అమెరికాలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అమెరికాలో 70కి పైగా లొకేషన్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వరకు విడుదలైన రీ రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక థియేటర్లలో ప్రభాస్ బిల్లా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ప్రభాస్ రేంజ్ అంటూ అయ‌న‌ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి టికెట్స్ కూడా భారీ స్థాయిలో టికెట్లను బుక్ చేసుకున్నారు . ఇక ‘బిల్లా సినిమాలో.. దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు. అనుష్క, నమిత, హన్సిక హీరోయిన్లుగా నటించాగా. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ రీ రిలీజ్‌లో వచ్చిన క‌ల‌క్ష‌న్‌ల‌ను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు ఇవ్వబోతున్నట్లుగా కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ తెలిపారు.