ఆ కోరిక తీరాల్సిందే..భర్త కోసం పూర్ణ షాకింగ్ నిర్ణయం.. ‘ఢీ’ బ్యూటీ డేరింగ్ డెసీషన్..!?

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అవుదామని వచ్చి ..మొదట హీరోయిన్ గా చేసి.. ఆ తర్వాత టైం బాగోలేక సైడ్ రోల్స్ చేసుకుంటూ తనదైన స్టైల్ లో నటించి అలరించి మెప్పించిన బ్యూటీ పేరే పూర్ణ. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు మలయాళ బ్యూటీ ని అయినా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి జనాలకు తన పేరును గుర్తించుకునేలా చేస్తుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమటపాకాయ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన పూర్ణ.. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో అవును , అవును 2 సినిమాల్లో నటించి జనాలను మెప్పించింది .

ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో అమ్మడు హీరోయిన్ గా నటించినా అవి ఏవి చెప్పుకోతగ్గ హిట్ కాలేదు. దీంతో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఢీ షోకి జడ్జిగా వ్యవహరించింది. ఈ షోలో అమ్ముడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. డాన్స్ నచ్చితే కొరికేయడం.. కొంచెం ఎమోషనల్ డాన్స్ వస్తే ఏడ్చేయడం.. దీంతో జనాల్లోకి బాగా ఎక్కింది పూర్ణ పెరౌ. ఈ క్రమంలోనే అమ్మడు హై లెవెల్ పర్ఫామెన్స్ చూసి సినీ ఇండస్ట్రీలో సైట్ క్యారెక్టర్స్ ఇచ్చారు కొందరు డైరెక్టర్స్.

ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ ను జెట్ స్పీడ్ లో ప్లాన్ చేసుకున్న పూర్ణ మంచి మంచి అవకాశాలు అందుకుంటూ కెరీర్లో సెట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంది. అయితే ఇదే టైంలో లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది. ఇప్పటికే తన కాబోయే భర్తని అఫీషియల్ గా అందరికీ చూయించేసింది. నటి పూర్ణ త్వరలోనే జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షానిద్ ఆసిఫ్ ఆలీతో కలిసి నటి పూర్ణ 7 అడుగులు వేయబోతుంది. ఇప్పటికే వీళ్ల నిశ్చితార్ధం జరిగిపోయింది .

అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ లో ఈ జంట మూడుముళ్లతో ఒకటి కాబోతున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమా లైఫ్ కు టోటల్ గా గుడ్ బాయ్ చెప్పనుంది పూర్ణ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడుకి సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సినిమాలకు దూరం అవ్వాలి అనుకున్న మాట వాస్తవమే కానీ అది లైఫ్ టైం కాదట కొన్నాళ్లు వరకే భర్త తో ఎంజాయ్ చేసాక..తాను అనుకున్న కంట్రీస్ చుట్టి రావాలని విదేశాలలో తిరగాలని వరల్డ్ టూర్ కి వెళ్లాలని తన లైఫ్ పార్టనర్ తో బోలెడు కోరికలు ఉన్నాయట. ఆ కోరికలు తీర్చుకున్నాక కచ్చితంగా కొంతకాలం తరువాత సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ అడుగుపెట్టి నటిస్తానని అమ్మడు సన్నిహితులతో చెప్పుకొచ్చిందట. ఈ క్రమంలో నే వచ్చిన సినిమా అవకాశాలను దూరం చేసుకుంటూ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది పూర్ణ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

Share post:

Latest