ఆ ఒక్కటి చేస్తే..ఆఫర్స్ అవే వస్తాయి..ఇస్మార్ట్ బ్యూటి మాస్ ఆన్సర్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలని వెండితెరపై తమ బొమ్మను చూసుకోవాలని సినీ ఇండస్ట్రీ ని ఏలేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది . కానీ ఆ అవకాశం అందరికీ రాదు . అలాంటి అవకాశం వచ్చిన కొందరే తమ కలలను పూర్తిగా సకారం చేసుకోగలరు. సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన సరే అవకాశాలు అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్లు పడిన కొన్ని కొన్ని కాంప్రమైజ్ లు కొన్ని కొన్ని విషయాల్లో తలవంచకపోతే హీరోయిన్గా నెట్టుకు రాలేరు. స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేరు. అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది మరాఠీ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. మనకు తెలిసిందే మరాఠీ కుటుంబంలో జన్మించిన నిధి అగర్వాల్ బెంగళూరులోనే పెరిగింది. నిధి అగర్వాల్ తెలుగు -తమిళ -కన్నడ భాషలలో పాపులారిటీ సంపాదించుకుంది.

నిధి అగర్వాల్ బెల్లీ డాన్స్ చేస్తే ఎలాంటి మగాడైనా సరే ఫిదా అవ్వాల్సిందే . అంతలా గిరగిరా ఊపేస్తూ తిప్పేస్తుంది. 2014 యమహా ఫాసినో మిస్ వరకు వెళ్లిన నిధి ..ఆ తర్వాత 2017 లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018 లో తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఇక తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని భాషల్లో పాపులారిటీ దక్కించుకుంది.

కాగా రీసెంట్ గా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్నదానికి మెయిన్ రీజన్ రెమ్యూనరేషన్ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” హీరోయిన్ అవ్వాలన్నది నా కోరిక అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆఫ్ కోర్స్ నాకు తగ్గ రేంజ్ సినిమాలో నాకు పడకపోయినా అరాకొరా సినిమాలు నాకు ఇప్పటికీ వస్తున్నాయి అంటే కారణం మాత్రం నా రెమ్యూనరేషన్. నేను అందరి హీరోయిన్స్ లా డిమాండ్ చేయను మేకర్స్ ఇచ్చినంత తీసుకుంటాను . అందుకే నాకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి . అంతేకాదు నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకు ముందు వేరే హీరోయిన్లు అనుకున్నారట. పారితోషకం ఎక్కువ అడగడంతోనే వాళ్ళని తీసేసి నన్ను పెట్టుకున్నారట. ఈ విషయం స్వయంగా మేకర్స్ చెప్పారు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రెమ్యూనరేషన్ పరంగా ఒక్క మెట్టు దిగితే హీరోయిన్స్ కి అవకాశాలు వస్తాయని పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది నిధి అగర్వాల్. కాగా అందుతున్న సమాచారం ప్రకారం నిధి అగర్వాల్ ఒక్కో సినిమాకి 30 నుంచి 45 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. వేరే హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ.