Mega-154 సినిమా టీజర్ డేట్ లాక్..!

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని చూసిన చిరంజీవి ఈ సినిమాతో కాస్త ట్రాక్ లోకి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లో సక్సెస్ అయితే మాత్రం సినిమా సక్సెస్ అయినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.అయితే చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డైరెక్టర్ బాబి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

Mega 154: Ravi Teja Unites With Chiranjeevi For A Powerful & Lengthy Role, Makers Make An Official Announcement

ఇక ఇందులో రవితేజ కూడా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా బాగా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇంకా అధికారికంగా ఈ సినిమా పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే చిత్ర బృందం పోస్టర్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.చిరంజీవి కెరియర్ లో ఈ సినిమా 154వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

First look of Mega 154 out- Cinema express
ఇక డైరెక్టర్ బాబి అయితే సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్రణాళికనే ప్లాన్ చేస్తున్నారు.ముందుగా దీపావళి పండుగ సందర్భంగా టీజర్ను విడుదల చేసి ఆ తర్వాత పాటను కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్, బాలకృష్ణ నటిస్తున్న 107 వ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇక అలాగే తమిళ హీరో విజయ్ దళపతి కూడా వారసుడు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లోని విడుదల కాబోతున్నారు తెలుస్తోంది మరి ఇలాంటి సినిమాలు మధ్య చిరంజీవి సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.