ఈ హాట్ ముద్దుగుమ్మలు.. మన భారతీయులు కాదా…!

సినిమా పరిశ్రమ అందరిని ఆదరిస్తుంది. వారి దగ్గర టాలెంట్ ఉండి సినిమాలు చేసి స్టార్ లైన వారు ఎందరో ఉన్నారు. ఇండియాలో ఉన్న సినిమా పరిశ్రమల‌లో బాలీవుడ్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందాల తార‌లకు బాలీవుడ్ లో కొదవలేదు. రోజు ఒక‌ అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వస్తున్నారు. వారిలో కొంతమంది మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఉంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్గా ఉన్న కొంతమంది భామలు భారతీయులు కాదట. బాలీవుడ్ లో స్టార్‌లుగా కొనసాగుతున్న పలువురు హీరోయిన్లలో ఇతర దేశస్తులు ఉన్నారు. వారు ఎవరంటే..

Alia Bhatt

అలియా భట్:
ఈమె బాలీవుడ్ కి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఈమె ప్రముఖ దర్శకుడు మహేష్ భ‌ట్ కూతురు… అలియా భట్ బాలీవుడ్ లోనే బిజీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఈమె ఇటీవులే రన్బీర్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌ర పెళ్లయిన తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్‌ను వారి ఖాతాలో వేసుకున్నారు. అయితే అలియా భట్ లండన్ లో పుట్టింది అక్కడే పెరిగింది. అలియా భట్ తండ్రి మహేష్ భ‌ట్ బ్రిటీష్ నటి సోనీ రజ్దాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆలియా తల్లి లండన్ దేశస్థురాలు కావడంతో అలియా అక్కడే పుట్టి పెరిగింది. ఆలియా కి బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది.

Katrina Kaif

కత్రినా కైఫ్:
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమె బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ సంవత్సరం కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ కూడా బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉంది. కత్రినా హాంగ్​కాంగ్​లో పుట్టి పెరిగింది.

Bollywood Actress Jacqueline Fernandez dazzles in this pictures-జాక్వలిన్  ఫెర్నాండేజ్ గ్లామరస్ ఇమేజస్

 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్..ఈ అందాల తార ఈ మధ్యకాలంలోనే బాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయమైంది. బాలీవుడ్ కి పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఈమె బాగా పాపులర్ అయింది. ఈమె ఎకువగా ఐటెం సాంగ్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. తాజాగా వచ్చిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమాలు ఈమె నటించిన ఐటెం సాంగ్ కూడా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ శ్రీలంకకు చెందింది.

Hot Video: Nargis Fakhri does b*ld photoshoot in black monokini, see  sensuous BTS moment | IWMBuzz

నర్గీస్ ఫక్రీ

రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన రాక్ స్టార్ సినిమా తో బాలీవుడ్కు పరిచయమైంది నర్గీస్ ఫక్రీ.. ఈమె ఆ సినిమా తర్వాత ఆమెకు నచ్చిన సినిమాలలోనే నటిస్తూ తనకంటూ ఓ మంచి ఇమేజ్‌ను బాలీవుడ్‌లో క్రియేట్ చేసుకుంది. ఈ అమ్మడు కూడా భారతీయ నటి కాదు. ఈ ముద్దుగుమ్మ న్యూయార్క్ లో పుట్టి పెరిగింది. ఈమెకు అమెరికా పౌరసత్వం కలిగి ఉంది.