నయనతార అభిమానులకు గుడ్ న్యూస్… ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన నయన్…!

కోలీవుడ్‌ స్టార్ కపుల్స్‌ నయనతార- విఘ్నేష్‌ శివన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తూ వారి ఫోటోలను షేర్ చేశారు. నయనతార- విఘ్నేష్‌ శివన్ లు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ లు ఈ సంవత్సరం జూన్ 9వ తేదీన ఒకటయ్యారు.

వారికి సంబంధించిన పెళ్లి వీడియోని కూడా నయనతార: బియాండ్ ది పెయిరీటేల్ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్- నెట్‌ప్లెక్స్‌లు త్వరలోనే స్ట్రీమింగ్‌ కానున్నాయి.. వారి పెళ్లి వేడుకను చూడడానికి వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే నయన్ విఘ్నేష్ లుఅభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. నయనతార తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నయనతార బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాలోో నటిస్తుంది.