అందాల చందమామ కాజల్‌ హాట్‌ ఫోటో షూట్లు.. అవకాశాలు దక్కేనా?

అందాల చందమామ కాజల్‌ అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేసిన అతి కొద్దికాలంలోనే సూపర్ పాపులర్ అయ్యింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరి స్టార్‌ హీరోలందరితోనూ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక దశలో అయితే యావత్ తెలుగు పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ రికార్డ్ సృష్టించింది. అయితే రెండేళ్ల క్రితం ఆమె మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో ఇటీవల ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు కాజల్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్‌గా తన సత్తాని చాటాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గత కొన్ని రోజులుగా వరుసగా హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. తాను బిడ్డకి జన్మనిచ్చినా తన అందం, ఫిట్నెస్‌ ఇంకా తగ్గలేదనే విషయాన్ని తెలియజేసాలా ఆ ఫోటో షూట్ చెప్పకనే చెబుతోంది. అయితే గతంలో ఒప్పుకున్న భారతీయుడు 2 మినహాయించి కొత్తగా ఆమెకి అవకాశాలు రాకపోవడం గమనార్హం.

తాను ఎంత ప్రయత్నించినా మేకర్స్ ఆమె వైపు చూడటం లేదని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే పెళ్లైన తర్వాత కూడా హీరోయిన్‌గా రాణించేవారు ఎందరో వున్నారు. తెలుగులో అలా కాదు. ఇక్కడ కొత్తతరం హీరోయిన్లు వచ్చారంటే పాతతరం హీరోయిన్లు కనుమరుగు అయిపోతూ వుంటారు. సినిమా అవకాశాలు మాట అటుంచితే, యాడ్స్ మాత్రం కాజల్‌ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. అయినా సినిమాల్లో నటించాలనే కోరిక మాత్రం ఆమెని వదలడం లేదు పాపం.