ఎట్టకేలకు బింబిసార ఓటిటి స్ట్రిమింగ్ డేట్ లాక్..!!

ఏన్నో సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార వంటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా అతిపెద్ద విజంగా నిలిచింది. ఈ చిత్రం అన్ని వర్గాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.థియేటర్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో నిలిచింది. దీంతో ఈ సినిమాను చూడని అభిమానులు సైతం ఓటీటి లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదీన లేకుంటే 7 వ తేదీన జీ-5 లో స్ట్రిమ్మింగ్ చేయబోతున్నట్లు టాక్ బాగా వినిపించింది.

Bimbisara OTT Date Fix..when is streaming ! – iittm.in
కానీ కాలేకపోయింది. ఇక దసరా కాకపోతే దీపావళికి కచ్చితంగా వస్తుందని అభిమానుల సైతం భావించారు. వారు అనుకున్నట్లుగానే తాజాగా ప్రేక్షకుల ఎదురుచూపులకు పుల్ స్టాప్ పెట్టే విధంగా బింబిసార చిత్రాన్ని ఓటిటి స్ట్రిమింగ్ డేట్ ను అధికారికంగా జీ5 తెలియజేసింది. దీపావళి కానుకగా ఈనెల 21న స్ట్రిమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోలో కింద ఒకడున్నాడు వాడి పేరు బింబి ,త్రీగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పండి అంటూ ఒక వీడియోను విడుదల చేశారు.

Exclusive: Why The Delay In 'Bimbisara' OTT Release Date?
ఇక ఈ సినిమాతో నూతన డైరెక్టర్ గా పరిచయమయ్యారు డైరెక్టర్ వశిష్ట. ఇందులో హీరోయిన్లుగా సంయుక్త మీనన్, కేథరిన్ నటించారు. కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ బ్యానర్ పైన నిర్మించారు. ప్రస్తుతం ఓటీటి స్ట్రీమింగ్ కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.