మహేష్ కూతురు సితార ఏం చేసిందో తెలుసా… చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు చిత్ర పరిశ్రమల సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ లో అడుగు పెట్టి తండ్రిని మించిన నటుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నారు. రీసెంట్గా సర్కార్ వారి పాట సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో మహేష్ న‌టించ‌బోతున్నాడు. కాగా ఇదే క్రమంలో దీపావళి సందర్భంగా ఆయన కూతురు డాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. ఇక ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మహేష్ బాబు కూతురు సితార ట్రెండింగ్ గా మారింది. దీనికి ప్రధాన కారణం ఆ వీడియోలో సితార ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించడం.. మరుగున పడిపోతున్న మన తెలుగు సాంప్రదాయాలను వాటి విలువలను తెలియజే విధంగా సితార ఆ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది.

సితార‌ ఆ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటోలలో సితారతో పాటు ఆమె గురువు మహతి బిక్షుతో కలిసి నృత్యం చేయ‌టం ఎంతో సంతోషంగా ఉందని ఆ పోస్టు కింద రాసుకు వచ్చింది. ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లతో సితారను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహేష్ బాబు ఆ వీడియో షేర్ చేస్తూ… ‘నన్ను గర్వపడేలా చేయడంలో నువ్వు ఎప్పుడు ఫెయిల్ కావు’.. అని సితారకు కితాబిచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)