పుష్ప 2 నుండి బ్లాస్టింగ్ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలే..!!

గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ పుష్ప. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టింది . మరీ ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫిలింఫేర్ అవార్డులో ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను సాధించి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది . కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం అల్లు అర్జున్ డి గ్లామరస్ లుక్ లో కనిపించాడు .

ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అల్లు అర్జున్ అనేంతలా ప్రాణం పెట్టి నటించాడు. మరి ముఖ్యంగా ప్రజెంట్ అల్లు అర్జున్ ని ఎవరు బన్నీ అని పిలవట్లేదు ..పుష్ప రాజ్ అంటూ సంబోధిస్తూ.. బన్నీ అనగానే పుష్ప సినిమా గుర్తుచేలా తన రేంజ్ ని క్రేజ్ ను మార్చేసుకున్నాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ . కాగా పుష్ప వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప2 పై హ్యూజ్ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు .

నిజానికి అన్ని అనుకున్నట్లే జరుగుంటే.. ఈ ఏడాది డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 2 సినిమా రిలీజ్ చేసి ఉండేవాళ్లు . కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల పుష్ప2 సినిమా షూటింగ్ లేట్ అయింది. ఇటీవలే పుష్ప2 సినిమా షూటింగ్ ప్రారంభమైంది . కాగా ఇప్పటికే షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను చిత్రీకరించిన్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు రీసెంట్గా పుష్ప1 తో కంపేర్ చేస్తే పుష్ప2ను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా సుకుమార్ డైరెక్షన్ కు సంబంధించిన మరో సెన్సేషనల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ఆటోగ్రాఫర్ మిరస్లో కూబా బ్రొజెక్ అల్లు అర్జున్ కి వివరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ ఫోటో చూస్తుంటే పుష్ప వన్ కి మించి పుష్ప2 అదిరిపోయే హిట్ అందుకుంటుంది అన్న నమ్మకాలు బలంగా వినిపిస్తున్నాయి . ప్రస్తుత్తం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి పుష్ప 2 సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?