బాలయ్య అభిమానులకు కని విని ఎరగని బిగ్ సర్ప్రైజ్… వెరీ వెరీ స్పెషల్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా దూసుకుపోతున్నాడు. ఇటు రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బాలయ్య టాప్ ప్లేస్ లో ఉన్నాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో బాలకృష్ణ అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన 107వ‌ సినిమా ఆయన వీర సింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

 తాజాగా నందమూరి బాలకృష్ణ.. సాయి ప్రియ రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన యాడ్‌ చేసారు.  తన తోటి హీరోల్లో చాలా మంది సినిమాల్లో వచ్చిన ఇమేజ్‌‌తో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. కానీ బాలయ్య మాత్రం ఇంత వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్‌లో  నటించలేదు. ఇపుడు వాటికి బ్రేక్ వేసాడు. ఈ రోజు సాయంత్రి ఈ కమర్షియల్ యాడ్ ప్రసారం కానుంది. (Twitter/Photo)

ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షో తో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఈ నెలలోనే ప్రారంభమైంది. ఈ సీజన్ లో కూడా బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు.

 నందమూరి హీరో కమర్షయల్ యాడ్ చేయడమనేదిటాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఇప్పటికే బాలయ్య వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ టాక్‌షోకు ఒకే చెప్పిన ఈయన తాజాగా ట్రెండ్‌కు తగ్గట్టు కమర్షియల్ యాడ్‌లో యాక్ట్ చేయడానికీ ఓకే చెప్పారు. సాయి ప్రియ కన‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన 116 Praramount కు ఈయన ప్రకటన చేసారు. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన యాడ్‌ను విడుదల చేయనున్నారు. (Twitter/Photo)

ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు సినిమాలతో ఆహా షో తో బిజీగా ఉన్న బాలకృష్ణ.. కమర్షియల్ యాడ్ రంగంలో కూడా దుమ్ము లేపడానికి బాలకృష్ణ రాబోతున్నాడు. ఆయన సాయి ప్రియ కన్స్ట్రక్ షన్స్ తరఫున ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఈరోజు రాత్రికి విడుదల చేయనున్నారు. బాలకృష్ణ తన 40 సంవత్సరాల సినీ కెరియర్లో ఇప్పటివరకు ఏ కమర్షియల్ యాడ్లో ఆయన నటించలేదు. ఆయన నటించబోయే తొలి కమర్షియల్ యాడ్ ఇది. ఈ యాడ్ తో బాలకృష్ణ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి..!!