ఆ నటికి ఎన్ని క‌ష్టాలు… రెండో పెళ్లి కూడా మూడునాళ్ల ముచ్చ‌టేనా…!

కర్ణాటక కు చెందిన బుల్లితెర నటి దివ్య.. ఈమె చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. దివ్య 2012లో ఒక వ్యక్తితో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి దివ్య ఒంటరిగానే తన జీవితాన్ని సాగా తీస్తుంది. దివ్య కోలీవుడ్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కోలీవుడ్ లో ఓ సీరియల్స్‌లో నటిస్తున‌ సమయంలో ఆ సీరియల్ సహా నటుడైన అయినా అర్ణవ్‌ తో ప్రేమలో పడింది.

 Actress Divya Loges Complaint Against Actor Arnav, Actress Divya, Actor Arnav, Marriage, Divorce, Complaint-పాపం ఆ నటికి రెండవ పెళ్లి కూడా మూన్నాళ్ళ ముచ్చటే..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరూ కలిసి కొంతకాలం సహజీవనం కూడా చేశారు. అర్ణవ్‌ ఇస్లాం మతస్థుడు అవడంతో… అతనిని పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా ఆ మతస్తురాలు అవ్వాలని ఒక కండిషన్ పెట్టాడు. దీంతో దివ్య కూడా ఇస్లాం మతం తీసుకుంది. ఇక ఈ సంవత్సరం జూన్‌లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒకటి అయ్యారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే దివ్య‌ గర్భం కూడా దాల్చింది. ఈ క్రమంలోనే దివ్యకు తనకంటే ముందు ఇంకో వ్యక్తితో వివాహం జ‌రిగి… వారికి ఓ పాప కూడా పుట్టిందన్న విషయంఅర్ణవ్‌ కు తెలిసింది.

Serial Actor Arnav Over Divya Sridhar accusation

దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకున్న ఫోటోలను, వీడియోలు ఆమె తన ఫేస్బుక్- ట్విటర్లో పెట్టుకుంది. వాటిని తొలగించాలని అర్ణవ్‌ ఆమెపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.. ఆమె డిలీట్ చేయనని నిరాకరించిందట. ఇక దీంతో అర్ణవ్‌ దివ్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె భర్తకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకుని నాతో పిల్లల్ని కనాలని చూస్తుందని అర్ణవ్ పోలీస్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Serial Actor Arnav Over Divya Sridhar accusation

దీంతో దివ్య చెన్నైలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో తన భర్త పై ఫిర్యాదు చేసింది. మేమిద్దరం చట్ట ప్రకారం భార్య భర్తలుగా కాపురం చేస్తున్నామని, తన భర్త అర్ణవ్‌ మరొక నటితో ప్రేమలో పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ నటితో సంబంధం ఉన్న విషయం తెలిసి ప్ర‌శ్నిస్తే ఆమె త‌న‌ను అంద‌రూ ముందు కొట్టి అవ‌మానించింద‌ని దివ్య త‌న ఫిర్యాదులో పేర్కొంది. అలాగే త‌న భ‌ర్త కూడా త‌న‌ను హింసిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది.