సమంత నటించిన శాకుంతలం సినిమా.. రిలీజ్ డేట్ లాక్..!!

హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో పాన్ ఇండియా హీరోయిన్ గా నటిస్తున్న పారాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎప్పటినుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

Shakuntalam: Samantha is ethereal as the divine beauty in first look poster  - Hindustan Times
ఇక ఈ సినిమా షూటింగ్ గత ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ఒక మోషన్ పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దుష్యంతుడు, శాకుంతల మధ్య ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో నటుడు సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో భరతుడి చిన్నప్పటి పాత్రలో మాత్రం అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటిస్తోంది.

ఇక సమంత ఇప్పటివరకు ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో ప్రేమ కథ చిత్రాలలో మాత్రమే నటించింది. అయితే మొదటిసారిగా ఈ పారాణిక చిత్రంలో నటించడంతో అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేస్తున్నాయి. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోందని ప్రకటించడంతో సమంత అభిమానుల సైతం కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.