ఆ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమానా..వద్దు బాబోయ్ వద్దు..!?

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా సినిమాలలోకి వ‌చ్చిన‌ నాగచైతన్య వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోగా టాలీవుడ్‌లో కోన‌సాగుతున్న‌డు. నాగచైతన్య వరుసగా తన ఖాతాలో మూడు హిట్‌లు వేసుకున్నాడు. నాగచైతన్య థాంక్యూ సినిమాతో భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య సినిమాలు విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అనుకున్నాం.

Samantha's divorce not over - Naga Chaitanya reacts to second marriage news - Tamil News - IndiaGlitz.com

అయినా కానీ ప్లాప్‌ దర్శకుల చుట్టూనే తిరుగుతున్నారు. ఇక తాజాగా విరాటపర్వం సినిమాతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల లతో సినిమా చేస్తారని తెలుస్తుంది. విరాటపర్వం సినిమాతో రాణాకి, సాయి పల్లవికి భారీ డిజాస్టర్ ఇచ్చిన ఈ డైరెక్టర్ తో సినిమా చేయొద్దు అని నాగచైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఆ డైరెక్టర్ మాకొద్దు రా బాబు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest