మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడికి ఎంత కట్నం ఇచ్చాడో తెలుసా..?

ప్రముఖ నటుడు నిర్మాత అయిన నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మెగా బ్రదర్ గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినీ పరిశ్రమకు నిర్మాతగా పరిచయమైన నాగబాబు సహాయ నటుడుగా అలాగే కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించారు. అంతేకాకుండా కానీ స్వయంగా అంజన ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించారు. 1986లో రాక్షసుడు అనే తెలుగు సినిమాతో మొదటిసారిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు నాగబాబు.ఆ తర్వాత షాక్ ,143, అంజి ఆరెంజ్ చిత్రాలలో అద్భుతమైన పాత్రలను ప్రదర్శించారు.

అర్ధరాత్రి నాగబాబు అల్లుడు కేకలు.. ఏమైంది?

1988లో చిరంజీవి, శోభన్ బాబు నటించిన రుద్రవీణ సినిమాతో మొదటిసారిగా నిర్మాతగా మారారు. ఇక వెండితెర పైన కాకుండా బుల్లితెరపై కూడా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు నాగబాబు. నాగబాబు సినీ కెరియర్ మొత్తంలో ఇప్పటివరకు 90కు పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి కూడా ప్రవేశించడం జరిగింది. నాగబాబుకి వరుణ్ తేజ్, కూతురు నిహారిక ఉన్నారు. మొన్న మధ్యనే నాగబాబు తన కూతురు నిహారికకు ఘనంగా వివాహాన్ని జరిపించారు. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్లో ఉదయపూర్, రాజ్ మహల్ నిహారిక వివాహం జరిగింది. నాగబాబు అల్లుడు నాగచైతన్య జొన్నాల గడ్డ.

Nagababu Surprise Gift To Son In Law Chaitanya మెగా అల్లుడికి మరిచిపోలేని  గిఫ్ట్

ఇక నాగబాబు అల్లుడుకి కూడా చాలా ఆస్తిపాస్తులు ఉన్నవారే అతని తండ్రి కూడా ఒక IPS అధికారి. అయితే నాగబాబు తన అల్లుడికి దాదాపుగా రూ.15 కోట్ల రూపాయల వరకు కట్నం ఇచ్చినట్లుగా సమాచారం ఇంకా తన కూతురికి ఆభరణాల కోసం రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఇక తన కూతురి పెళ్లికూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చాలా ఘనంగా జరిపారు నాగబాబు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా కొన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఇక వాటితోపాటు నాగబాబు ఒక ఖరీదైన ఇల్లును కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Share post:

Latest