ఇందిరా దేవి చివరి రోజుల్లో ఇంత నరకం అనుభవించారా..?

సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి నిన్న అనగా సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా సోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు మరణించగా నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మరణించడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యతో బాధపడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి ముందు ఏం జరిగింది అనే విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి.

Mahesh Babu's Mother, Indira Devi Passes Away At The Age Of 70 Due To  Age-Related Sickness

అసలు విషయంలోకి వెళితే.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇందిరా దేవికి ఆరోగ్యం మరింత విషమించడంతో తనను హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్ లో చేర్చారు. ఇక ఆమెకు ప్రతిరోజు అక్కడ చికిత్స చేయించగా.. దాదాపుగా 30 రోజుల పాటు ఆమె హాస్పిటల్లోనే ఉన్నట్లు సమాచారం.. నాలుగు రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగా అప్పటికే ఆమె పరిస్థితి కష్టంగా ఉందని వైద్యుల కుటుంబ సభ్యులతో తెలిపారట. ఇక దాంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా కూడా నాలుగు రోజులుగా ఆమెకు తమ పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆమెకు ధైర్యం కల్పించే విధంగా తోడుగా ఉంటామని తెలిపారు. అయినా కూడా ఆమె అనారోగ్య పరిస్థితి కుదరపడకపోవడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ నాయకులు ఆమె మరణానికి సంతాపం తెలియజేశారు.

ఇకపోతే ఇందిరా దేవి తన పిల్లలను ఒక మార్గంలో పెట్టడానికి ఎంతో కష్టపడింది. ఇక దేశం గర్వించదగ్గ గొప్ప నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది అని చెప్పవచ్చు. అయితే ఎంత డబ్బు ఉన్నా సరే అనారోగ్య కారణంగా ఆమె మరణించడం అందరినీ బాధపెడుతోంది. ముఖ్యంగా 30 రోజులపాటు ఆమె హాస్పిటల్లో ఉంటూ నరకయాతన అనుభవించింది అని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Share post:

Latest