ఆ వార్తలను నిజం చేస్తున్న చరణ్..ఇంతకన్నా ఏం కావాలి మెగా అభిమానులకు..!!

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెగా పవర్ రామ్ చరణ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు సినిమాలోకి తండ్రి పేరు చెప్పుకొని ఎంటర్ అయిన ఆ తర్వాత తన స్వయం శక్తితో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్నాడు. ప్రజెంట్ రాంచరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ కెరియర్ పరంగా ఎలా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటారు .

దానికి కారణం ఉపాసన ఆయన భార్య. మనకు తెలిసిందే.. రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యి దాదాపు పదేళ్లు గడుస్తున్న వీళ్ళకి ఇంకా పిల్లలు లేరు. కాగా రీసెంట్ గా గణేష్ నిమజ్జనం నాడు బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో అందరూ మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు . అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి ఉపాసన నుండి ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.

కాగా రీసెంట్ గా రామ్ చరణ్ తన సిస్టర్స్ శ్రీజ, సుస్మిత వాళ్ళ పిల్లలతో పాటు టూర్ కి వెళ్ళాడు . ప్రత్యేక విమానంలో ఆయన తన ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్ళిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఈ పిక్స్ కి చూసిన ఉపాసన పోస్ట్ చేస్తూ..” మిస్ యు రాంచరణ్” అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో మెగా అభిమానుల్లో కొత్త డౌట్లు మొదలయ్యాయి . నిజంగానే ఉపాసన ప్రెగ్నెంట్ నా..? అందుకే రామ్ చరణ్ ఆమెను ఎక్కడికి తీసుకెళ్లడం లేదా..? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా ఉపాసన ప్రెగ్నెంట్ అయితే ఇంతకుమించిన గుడ్ న్యూస్ మాకు మరొకటి లేదు అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి దీనిపై ఉపాసన లేదా మెగాస్టార్ ఫ్యామిలీ ఏమైనా రెస్పాండ్ అవుతారో లేదో..?

 

Share post:

Latest