ఆ న‌టుడితో ఓపెన్‌గా రెచ్చిపోయిన సురేఖ‌వాణి… నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అటు తల్లి క్యారెక్టర్ లోను… భార్య క్యారెక్టర్ల‌లో న‌టిస్తూ… చూడ‌డానికి పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది.

సురేఖ వాణి కూతురు సుప్రీత‌తో కలిసి చేసే ర‌చ్చ‌ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వ‌య‌స్సులో కూడా ఆమె మోడల్ డ్రెస్సులు వేసుకుని కూతురు కంటే చాలా యంగ్ గా, అందంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో సురేఖ వాణి తరచూ వార్తల్లో వైరల్ అవుతుంది. ఇక తను కూతురితోపాటు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారుతాయి. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ఇంట్లో చిన్న బర్త్ డే పార్టీ జరిగింది.

ఆ బర్త్డే పార్టీకి పలువురు నటులు వ‌చ్చారు. వారిలో నటుడు రాజా రవీంద్రన్ కూడా ఉన్నాడు. సురేఖ వాణి, షానూర్ సనా, హేమ తదితర తోటి నటీనటులు నటి రజితతో కలిసి బర్త్డే పార్టీలో సందడి చేశారు. అయితే ఆ సందడిని నటి హేమ ఫోన్లో చిత్రీకరించింది. ఆ సమయంలో సురేఖవాణి రాజా రవీంద్ర మెడపై చేతులు వేసి తెగ డాన్సులు చేస్తుంది.

ఓపెన్ గా రవీందర్ తో రెచ్చిపోయి తెగ సందడి సందడి చేసింది.ఇక ఈ ఫోటోలు చూసిన నెటి జనులు సురేఖవాణి పై విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆ వయసులో మీకు ఆ డాన్సులు ఆ హంగామా అంత‌ అవసరమా అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.