చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి పాడు పనులు.. శ్రీ రెడ్డి పై తేజస్వి హాట్ కామెంట్స్..!!

కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరెడ్డి అందరి విషయాల్లో తలదూరిస్తూ నానా రభస చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయాన్ని కూడా తెలియజెప్పిన మొదటి వ్యక్తి ఈమె కావడం గమనార్హం. ఇక శ్రీ రెడ్డి గతంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్, హీరో నాని తదితరులు ఈమెను శారీరకంగా వాడుకున్నారు అని బట్టబయలు చేసింది. అంతేకాదు వారితో దిగిన ఫోటోలు, చేసిన చాట్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఇకపోతే గత కొద్దిరోజులు నుంచి ఇలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా ఎక్కడో చెన్నైలో ఒక తోటలో పలు రకాల ఘుమఘుమలాడే వంటలు తయారు చేస్తూ.. వీక్షకులకు బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో సమాజంలో జరిగే పలు విషయాలను చెబుతూ ఉంటుంది. అంతేకాదు అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అంటూ ఇప్పుడు ఈమె సామాజిక సేవ మొదలుపెట్టిందని చెప్పవచ్చు.When Women Use Sexually Explicit Language: The Case Of Telugu Actor Sri  Reddy

ఇక ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి పై ప్రముఖ హీరోయిన్ తేజస్వి మదివాడ షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. తేజస్వి తాజాగా కమిట్మెంట్ అనే సినిమాలో చాలా బోల్డ్ గా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ , టీజర్ అన్నీ విడుదల కాగా ప్రేక్షకులలో ఆద్యంతం ఆసక్తిని రేపుతున్నాయి అంతేకాదు చాలా హాట్ గా ఉండడంతో పాటు ఇంతటి బోల్డ్ సినిమా ఎప్పుడూ చూడలేదు భయ్యా అనే విధంగా ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేపట్టింది తేజస్వి.Tejaswi Madivada: Commitment will get me recognition as a performer beyond  my looks

అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. కమిట్మెంట్ సినిమాలో శ్రీరెడ్డి బాగోతాలు కొన్ని తెలియజేసే ప్రయత్నం చేసాము.. అలాగే రాంగోపాల్ వర్మ క్యారెక్టర్ కి సంబంధించి కూడా కొన్ని అంశాలు జోడించడం జరిగింది అంటూ ఆమె వెల్లడించింది. శ్రీరెడ్డి గురించి కూడా ఆమె మాట్లాడుతూ చేసేవన్ని పాడు పనులు
.. చెప్పేవి శ్రీరంగనీతులు అంటూ ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అన్ని కానిచ్చేశాక ఇతరులపై నిందలు వేయడం ఎందుకో నాకు మాత్రం అర్థం కావడం లేదు అంటూ తేజస్వి శ్రీరెడ్డి గురించి ఇలా సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి పై తేజస్వి చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest