అందుకే సమంత చైతూ ను ప్రేమించిందా.. వైరల్ అవుతున్న న్యూస్..!!

ప్రేమా.. రెండు అక్షరాల ఈ మధురమైన భావం రెండు జీవితాలను ఒకటి చేస్తుంది అని చెప్పడం సందేహమే లేదు. కానీ అలా ఇద్దరు మనుషులు తమ మనసులను ఒకటి చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకరికొకరులో ఏదైనా వ్యక్తిత్వం నచ్చడం లేదా అందానికి మోహితులవడం ఇంకా చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాలు వల్ల పెళ్లి చేసుకుని ఒకటవుతారు కానీ విడిపోయే సమయంలో ఎందుకు ఆ కారణాలు గుర్తుకు రావట్లేదు అంటూ ఎంతోమంది విడిపోయిన వారిపై. ఇప్పటికే వారిని నిందించడం జరిగింది అలాంటి వారిలో సమంత – నాగచైతన్య కూడా ఒకరు. ఒకానొక సమయంలో కొన్ని కారణాలవల్ల ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీరు విడిపోయే సమయంలో ఆ కారణాలు గుర్తుకు రాలేదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం.Naga Chaitanya And Samantha's Love Story: Dated For Years And Got Married  To Separate Amicably

ఇకపోతే సమంత కూడా ఆ కారణం వల్లే నాగచైతన్యను ప్రేమించిందా? మళ్ళీ విడిపోవడానికి గల కారణం ఉన్నప్పుడు కలిసి ఉండడానికి అప్పటి కారణాలు గుర్తుకు రాలేదా? అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సమంత – నాగచైతన్య మొదటిసారి నటించిన చిత్రం ఏ మాయ చేసావే. గతం లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. ఈ సినిమా సమయం అప్పుడే మొదలైంది.. తన దగ్గర తినడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అది. ఇక ఆ సమయంలోనే నాగచైతన్య నన్ను ఆదుకున్నారు. ఇక అంతేకాదు మా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా నా దగ్గర మొబైల్ లేని పరిస్థితిలో నాగచైతన్య నాపై చాలా కేర్ తీసుకోవడమే కాకుండా మా అమ్మ తో మాట్లాడమని తెలియజేసినట్లుగా చెప్పుకొచ్చింది. తన కెరియర్ చాలా లో ప్రొఫైల్ లో కొనసాగిస్తున్నప్పుడు నాగచైతన్య దగ్గరుండి తనను చూసుకున్నాడు అని అతను ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటూ పొగిడింది.Did Samantha, Naga Chaitanya had a marriage contract? Here's what rumours  say

ఇక సమంతపై నాగచైతన్య తీసుకున్న కేర్, చూపించిన ప్రేమ కారణంగా నాగచైతన్యత ప్రేమలో పడింది అలాగే వివాహం చేసుకుంది. కానీ ఎవరో చేసిన కొన్ని పనుల కారణంగా తాను ప్రేమించిన నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది. మరి విడాకులు తీసుకునే సమయంలో నాగ చైతన్య ప్రేమ, జాగ్రత్త ఎందుకు సమంతకు కనిపించడం లేదు అంటూ పాత వార్తలను వైరల్ చేస్తూ అభిమానులు మరొకసారి సమంత పై విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest