హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ..

మధ్యప్రదేశ్ ముద్దుగుమ్మ శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ మూవీలో తనకు తానే ముద్దుముద్దుగా డబ్బింగ్ చెప్పుకొని హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలో ఒక రోల్ చేసింది. అనంతరం మహానటి మూవీలో సుశీల పాత్రలో మెరిసింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్ర పోషించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ మూవీలలో నటిస్తూ అలరిస్తోంది.

28 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ బబ్లీ గర్ల్ తన అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి సెగలు పుట్టిస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలు పంచుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. తాజాగా ఈ అందాల తార షేర్ చేసిన ఒక ఫొటో షూట్ మత్తెక్కిస్తోంది. ఈ ఫొటో షూట్ లో ఈ బ్యూటీ సిట్టింగ్ పొజిషన్‌లో ఉండి కొరకొర చూపులతో పిచ్చెక్కిస్తోంది. ఈ నిశ్శబ్దం నటి రిప్పుడ్‌ జీన్స్ ప్యాంట్స్, వైట్ కలర్ బ్రా, హై హీల్స్ తో తన లుక్ కంప్లీట్ చేసింది. మెడలో గొలుసు చేతికి ఒక బ్రేస్ లెట్ ధరించి సెక్సీ లుక్స్ తో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది.

షేర్ చేసి 24 గంటలు గడవక ముందే ఆమె ఫొటోలకు ఒక లక్షా 30వేల వరకు లైకులు వచ్చాయి. ఈ ఫొటోలు చూసి అభిమానులు వావ్ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డైటింగ్ చేసి బాగా సన్నగా అయ్యింది. ఇటీవల జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో ఈ తార మెరిసింది. ఇప్పుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన మహారాజు అనే సినిమాలో నటిస్తోంది.

Share post:

Latest