మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా శుభ ముహూర్తం అనేది చాలా ముఖ్యం. ఏ శుభకార్యమైనా శుభ ముహూర్తం చూసే చేస్తాం మనం. అదే క్రమంలో పోయిన రెండు సంవత్సరాలు కరోనా లాక్ డౌన్ కారణంగా శుభకార్యాలు ఏవి జరగలేదు. పోయిన రెండేళ్లలో చాలామంది శుభకార్యాలు మాటే ఎత్తలేదు. పెళ్లి ముహూర్తాలు.. వివిధ శుభకార్యాలు పెట్టుకున్నా కోవిడ్ నిబంధన కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు.
ఇదే క్రమంలో శుభకార్యాలపై ఆధారపడిన పరిశ్రమలు, కళాకారులు అందరూ ఇప్పుడు వారి పనుల్లో బిజీ అయ్యారు. అలాగే ఈ సంవత్సరం బంగారం, వెండి ఇతర వస్త్ర కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయి. ఈ సంవత్సరం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో మొదట సగంలోనే వేలాది పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగాయి. ఈ క్రమంలో శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి నెల జనవరి నుంచి జూన్ నెల వరకు వేలాదిగా శుభకార్యాలు.. వివాహాలు జరిగిన జూలైలో ఆషాడమాసం రావడంతో శుభకార్యాలకు బ్రేక్ వచ్చింది.
ఆగస్టు నెల నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలు చేసేవారు ముహూర్తాల చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆగస్టు నెలలో ఏ రోజులు శుభకార్యాలకు అనువుగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు శ్రావణమాసంలో 3, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్లో బాద్రపద మాసం, శుక్ర మౌఢ్యమి ప్రారంభంలో, అక్టోబర్ నవంబర్లో శుక్ర మౌఢ్యమి వరకు మంచి రోజులు లేవు. మళ్లీ డిసెంబర్ లో మంచి రోజులు ఉన్నాయి.
ఆషాడం కారణంగా నెల రోజులపాటు పెళ్లిళ్లు.. శుభకార్యాలు లేవు. ఇక శ్రావణమాసం అంటే పెళ్లిళ్లు మాసం అని అంటారు. కానీ ఈ సంవత్సరం శ్రావణమాసంలో 10 రోజులు శుభ ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ డిసెంబర్ నెలలోనే శుభముహూర్తాలు ఉన్నాయి. ఆపై ఉగాది వరకు ముహూర్తాలేవని పండితులు అంటున్నారు శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసేవారు ఈ సమయంలోనే చేయాలని చాలా తొందర పడుతున్నారు.