Jr. NTR ట్రైనర్ మహేష్ బాబుకి కూడా కావాలట… అంత విషయం వుందా అక్కడ?

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారంటే అర్ధం చేసుకోండి. అంతవరకూ ఒక కానీ అందులో నటించిన మన హీరోలు చరణ్, తారక్ నటనాలపై కూడా ప్రశంసాలు వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాని చూసిన ఎవరికైనా చరణ్, తారక్ ల కష్టం ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. వారి శరీరాకృతికి వారు చేసిన వ్యాయామాలు న భూతొ న భవిష్యతి. ఇకపోతే నెక్స్ట్ రాజమౌళి…మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది ప్రారంభం నుండి ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం తారక్ భారీ వర్కౌట్ చేసిన విషయం తెలిసిందే. గిరిజన ప్రాంతానికి చెందిన నాయకుడిగా కొమరం భీం పాత్ర కోసం తన బాడీ షేప్ మార్చుకోవడానికి చాలా నెలలు టైం జిమ్ లో వర్క్ ఔట్స్ చేశాడు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ కి “లాయోడ్ స్టీవెన్” అనే ఫేమస్ జిమ్ ట్రైనర్ తారక్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా లాయోడ్ స్టీవెన్ ఇప్పుడు మహేష్ బాబు కి ట్రైనర్ గా పనిచేయడానికి రెడీ అయ్యారు.

అవును… త్వరలో మహేష్ – రాజమౌళి కాంబోకోసం అతను మరలా పని చేయనున్నాడు. లాయోడ్ స్టీవెన్.. ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే కాదు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి కూడా పర్సనల్ జిమ్ ట్రైనర్ అన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసు. ప్రస్తుతం మహేష్ “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నారు. “బాహుబలి 2”, “RRR”ల కంటే మహేష్ సినిమా అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.