గులాబ్ జామ్ అంటూ ప్రభాస్ ను పొగిడిన కృతి శెట్టి.. నెటిజన్స్ ట్రోల్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతూ పారితోషకం విషయంలో నెంబర్ వన్ హీరోగా చలామణి అవుతూ ఉండడం గమనార్హం. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఆయన కెరియర్ కూడా పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కి ఉన్నంత ఫాలోయింగ్ అక్కడ స్టార్ హీరోలకి కూడా లేదని చెప్పవచ్చు.ఇక ఆయన తో కలసి నటించిన నటీనటులు కూడా చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యంగ్ హీరోయిన్ ప్రభాస్ ను గులాబ్ జామ్ తో పోల్చింది.It's Been 20 Years Since Prabhas Faced The Camera For The First Time

ఇక ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న కర్ణాటక ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. కృతి శెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అందం , అభినయంతో అభిమానులను సంపాదించుకున్న కృతి శెట్టి ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి మరెన్నో వాణిజ్య ప్రకటనలో కూడా నటించింది. ఇక అలా తన క్రేజ్ ను హీరోయిన్గా అవకాశం తెచ్చుకునే వరకు సంపాదించుకుంది. అంతేకాదు సీరియల్ ప్రకటనలలో అలాగే జువెలరీ ప్రకటనలో కూడా పనిచేస్తుంది.Prabhas with Krithi Shetty: కృతిశెట్టే కావాలంటున్న ప్రభాస్.. కారణం అదే - OK  Telugu

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ని యాంకర్ ప్రభాస్ ను ఏ స్వీట్ తో పోలుస్తావు అని అడగడంతో గులాబ్ జామ్ తో పోల్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పాటు నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ తో అసలు నటించనే లేదు ఇక ఆయన గురించి బాగానే చెబుతోంది కదా ! ఇది మరీ టూ మచ్ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

Share post:

Latest