చైతన్య వల్లే ఆ విషయంలో తగ్గనున్న సమంత..కారణం..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సమంత అని చెప్పవచ్చు. కేవలం దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరాది సినీఇండస్ట్రీలో కూడా తన పాగా వేయడానికి ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఒకవైపు లవ్ రొమాంటిక్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు జానపద నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తోంది అంతేకాదు యాక్షన్ , బోల్డ్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ క్రమంలోని తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇక పాన్ ఇండియా రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హాలీవుడ్ సినిమాలలో కూడా నటించబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయిNaga Chaitanya opens up on life after divorce from ex-wife Samantha Ruth  Prabhu, says 'earlier I could not...' | Regional News | Zee Newsఇదిలా ఉండగా సమంతకు తమిళ్, హిందీ భాషలలో అవకాశాలు వస్తున్నప్పటికీ ఎక్కువగా తెలుగు సినిమాలకు ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా సమంత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమంతకు టాలీవుడ్ నుంచి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఈమె కూడా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తోందని వెల్లడించారు. ఇక తెలుగులో మంచి బ్యానర్, క్రియేటివ్ డైరెక్టర్లు ఎవరైనా సరే కథ చెబితే చాలు తక్కువ రెమ్యునరేషన్ తో నటించడానికి కూడా సిద్ధంగా ఉందని సమంత సన్నిహితులు చెప్పడం జరిగింది. ఇక ఇలా తక్కువ పారితోషికం తో నటించడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి కూడా అభిమానుల ఆరాధిస్తూ ఉండడం గమనార్హం.Samantha Ruth Prabhu's throwback interview about Naga Chaitanya goes VIRAL  amid divorce announcement

మరికొంతమంది నుంచి అందుకున్న సమాచారం ప్రకారం సమంత కేవలం నాగచైతన్య కోసమే తన పారితోషకాన్ని తగ్గించుకొని మరీ తెలుగు సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది అని .. ఒకరకంగా చెప్పాలి అంటే నాగచైతన్య పై రివేంజ్ తీర్చుకోవడానికే సమంతా ఇలా చేస్తోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తన భర్తను డామినేట్ చేయడానికి రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుంటుంది అంటే ఇక భవిష్యత్తులో తన పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ చైతు అభిమానులు కూడా ఈమెపై జాలి చూపిస్తున్నారు.

Share post:

Latest