BiggBoss6 : ఈ హాట్ భామ‌ల‌తో అందాల ఆరబోతతో హౌస్‌ ర‌చ్చ ర‌చ్చే

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 6 సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్‌బాస్‌ సీజన్ 6 లోకి 20 మంది కంటెస్టెంట్లు వస్తారు. బిగ్ బాస్‌ అన్ని సీజన్లను ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. హౌస్‌లో ఎన్ని వివాదాలు వచ్చినా ఎంటర్టైన్ మాత్రం బాగా పండించారు.

దీంతోపాటు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ లేడీ కంటిస్టెంట్స్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సంవత్సరం బిగ్ బాస్ హౌస్ లోకి ముగ్గురు హాట్ హాట్ ముద్దుగుమ్మలను తీసుకున్నారట. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో ఈ సీజ‌న్‌లో మామూలుగా ఉండదని… స్కిన్ షో కానీ రొమాన్స్ కానీ విపరీతంగా ఉంటుందని టాక్‌ వస్తుంది.

BiggBoss6 Lady Contestants

వారిలో ఒకరు రాంగోపాల్ వర్మ కంపెనీ నుండి బిగ్‌బాస్‌ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఇనెయాా సుల్తానా ఒక‌రు. అలాగే హీరోయిన్ వాసంతి కృష్ణతో పాటు ఒక‌ప్ప‌టి ఐటెం గ‌ర్ల్ అభినయశ్రీ కూడా ఈ బిగ్ బాస్ సీజన్లోకి కంటెస్టెంట్ గా రాబోతుంద‌ట‌. వీరి అందాల ఆరబోతతో బిగ్ బాస్ హౌస్ రచ్చ రచ్చ అని ప్రేక్షకులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ కూడా పుష్క‌లంగా ఉండ‌బోతోంద‌ట‌.