#NBK 107 షూటింగ్ స్పాట్ నుంచి సాంగ్ లీక్.. అదరహో అనిపిస్తున్న సన్నివేశం.. వీడియో వైరల్.!!

నటసింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పాట్ నుంచి ఒక మేకింగ్ సాంగ్ వీడియో నుంచి కొంత భాగం లీక్ కాగా ఆ సన్నివేశం ఫేస్బుక్లో వైరల్ గా మారుతుంది. ఇక ఎంతోమంది మగువల మధ్య బాలయ్య నడుచుకుంటూ రావడం జై బాలయ్య అనే పాటకు స్టెప్పులు వేయడం .. చూసే చూపరులను చాలా బాగా ఆకట్టుకుంటారు. ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెట్టుకుంటున్నారు. జై బాలయ్య..జై బాలయ్య అంటూ సాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు.Balakrishna: ఆలంపూర్‌లో బాలయ్య సందడి | Hero Balakrishna's NBK 107 Movie Shoots In Alampur

నిన్న ఆలంపూర్ లో ఉన్న ఒక దేవాలయంలో ఈ అద్భుతమైన షూటింగ్ నిర్వహించడం జరిగింది. ఇకపోతే దీనిని లీక్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఇందులో శ్రీ లీల బాలకృష్ణ కు తండ్రిగా నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ సినిమా తరువాత మరొక యంగ్ డైరెక్టర్ కు ఆయన అవకాశం ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.NBK 107 : ఆలంపూర్‌లో బాలకృష్ణ సందడి.. వైరల్ అవుతున్న 107వ సినిమా లేటెస్ట్ పిక్స్..NBK 107 : ఆలంపూర్‌లో బాలకృష్ణ సందడి.. వైరల్ అవుతున్న 107వ సినిమా ...

ఇకపోతే బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ ఒకవైపు సినీ ఇండస్ట్రీలో మరొకవైపు రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొనడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య నేడు దేశం గర్వించ దగ్గ నటుడిగా మారుతుండడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఇదొక హర్షదాయకమైన విషయమని చెప్పవచ్చు. https://fb.watch/eo5rr-EKri/