బాక్స్ ఆఫిస్ వద్ద “ది వారియర్” డిజాస్టర్ కలెక్షన్స్ .. పరిస్దితి ఎంత దారుణంటే..?

సినీ ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉండవు..ఏ క్షణం ఏదైన జరగచ్చు అంటూ మరోసారీ ప్రూవ్ చేసింది “ది వారియర్ ” మూవీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్షన్ లో..టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోలీస్ ఆఫిసర్ గా నటించిన చిత్రం “ది వారియర్”.

లెటేస్ట్ సెన్ సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బుల్లెట్ బండి బండి పాట పర్లేదు అనిపించినా..మిగతా అన్ని ఫ్లాప్ అయ్యాయి.

 

పైగా ఈ సినిమాలో చాలా బోరింగ్, రొటీన్ సీన్స్ ఉండటమే కాకుండా..చాలా సీన్లని ఎక్కడో సినిమాలో చూసిన్నట్లే ఉంది. దీంతో జనలాకు విసుకువచ్చి..సినిమాకి డిజాస్టర్ రివ్యూ ఇచ్చారు. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ కి ముందు ఓ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయని భావించిన అభిమానులకు..ఊహించని షాక్ ఇచ్చాయి “ది వారియర్” మూవీ కలెక్షన్స్..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ది వారియర్ కలెక్షన్స్ రూ.7.54 కోట్ల రూపాయ‌లతో పర్లేదు అనిపించినా..మిగిలిన రెండు రోజుల్లో మాత్రం దారుణ కలెక్షన్స్ రాబట్టింది. శుక్రవారం అయితే..కనీసం 4 కోట్లు కూడా కలెక్ట్ చేయని పరిస్ధితి దాపురించింది అంటున్నారు సినీ వర్గాలు. శని వారం నాటికి సినిమా కలెక్షన్స్ 5 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసి..మొత్తంగా 17 కోట్లు కూడా దాటని పరిస్ధితిని తెచ్చుకుంది “ది వారియర్” .

నిజానికి ఈ సినిమా రూ. 43.10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అయితే..ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా రూ.44 కోట్లు సాధించాల్సిందే..మరి ఇంత వీక్ కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేస్తుందా అంటే డౌటే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు .