ఇక రాశి ఖన్నా తట్టాబుట్టా సర్దేసుకోవచ్చా..?

టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించాలంటే కేవలం అందం ఒకటే ఉంటే సరిపోదు.. నటనతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటారు. అయితే ఈ మూడింటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల భామ రాశి ఖన్నా. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో, వరుసగా ఆఫర్లు ఆమెను పలకరించాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది ఈ బ్యూటీ. అయితే ఇదంతా ఇప్పుడు గతమనే చెప్పాలి.

ఒకే కూరను రోజూ తినలేం.. అలాగే ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్ ను కొన్నేళ్ల పాటు భరించడం కూడా కష్టమే అంటున్నారు కొందరు అభిమానులు. అమ్మడు ఎంచుకునే పాత్రలు మొదలుకొని, రొటీన్ రొట్టకొట్టుడు పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించేస్తుంది. పోనీ కథలో ఏదైనా ముఖ్య పాత్రలు చేస్తుందా అంటే అదీ లేదు. హీరో పక్కన రొమాన్స్ చేసేందుకు ఓ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమెను తీసుకునే పాత్రలే ఈమధ్య కాలంలో అమ్మడు చేస్తూ వస్తోంది.

ఇక రాశి ఖన్నా సినిమా అంటే గతంలో మినిమం గ్యారెంటీ హిట్ అనే ముద్ర ఉండేది. కానీ అది ఇప్పుడు లేదు. అమ్మడు ఏది ముట్టుకున్నా అట్టర్ ఫ్లాపులుగా మిగిలుతున్నాయి. దీంతో ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలంటేనే హీరోలు భయపడుతున్నారు. స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోవడమే మానేశారు. ఇక ఇటీవల ఆమె నటించిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు కూడా బిస్కెట్ కావడంతో, ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా రాశి పేరు చెబితే వద్దు బాబోయ్ అనేస్తున్నారట. ఈ లెక్కన ఇక టాలీవుడ్ నుంచి రాశి తట్టాబుట్టా సర్దేసుకునే టైమ్ వచ్చేసినట్లేనా అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Share post:

Latest