‘బింబిసార’ సెట్స్ లో హీరోయిన్ ‘కేథరీన్’ వెకిలి చేష్టలు… నెటిజన్లు ఫైర్!

టాలీవుడ్లో రిలీజుకి సిద్ధంగా వున్న క్రేజీ సినిమా బింబిసార. ఈ సినిమాని ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించగా, కళ్యాణ్ రామ్ – క్యాథ‌రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. దీనికి కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరై నందమూరి అభిమానులను అలరించారు. ఇకపోతే కేథరీన్ సినిమా కెరీర్ గ్రాఫ్ గురించి తెలిసినదే. తెలుగు..త‌మిళ్ సినిమాల్లో అమ్మడు అరుదుగా నటిస్తూ వస్తోంది. కాగా బింబిసార సినిమాలో ఈమె మహారాణి పాత్రను పోషించింది.

దురదృష్టకరం ఏమంటే సినిమా అవకాశాలు ఈ ముద్దుగుమ్మకు బాగానే వస్తున్నా, ప‌రాజ‌యాల‌తో సతమతమవుతోంది. అయితే అమ్మడు కోలీవుడ్ లో మాత్రం మంచి బిజీగా వుంది. అలాగే ప్ర‌స్తుతం క్యాథ‌రీన్ తెలుగులోనే ఓ నాలుగైదు సినిమాలు చేస్తుంది. క్యాథ‌రీన్ ఈ బింబిసార సినిమాలో ప్రిన్సెస్ ‘ఐరా’గా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే ఆ పాత్ర ఆహార్యంలో అచ్చం ప్రిన్సెస్ నే త‌ల‌పిస్తుంది క్యాథీ. ఇక్కడ ఫోటోని చూస్తేనే మీకు అర్ధం అయిపోతుంది. యువ‌రాణి కాస్ట్య్సూమ్స్ లో అమ్మడు సూపర్ గా వుంది.

అంతవరకూ బాగానే వుంది కానీ, షూటింగ్ స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన ఓ వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారడంతో, నందమూరి అభిమానులు అమ్మడు పైన గుర్రుగా వున్నారు. విషయమేమంటే సదరు వీడియోలో క్యాథ‌రీన్ ప్రిన్సెస్ అవ‌తారంలో ముస్తాబై చైర్ లో కూర్చుంది. ఆ అందాన్ని కెమెరా పై నుంచి క్యాప్చ‌ర్ చేస్తూ వస్తుండ‌గా, కింద కాళ్ల‌కి మాత్రం ఓ నార్మల్ పాత చెప్ప‌లు ఉండటాన్ని గమనించవచ్చు. కాగా ఆ చెప్పుల్ని వీడియోలో హైలైట్ చేసి చూపించడం కొసమెరుపు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. సదరు ఫుటేజ్ చూసిన నందమూరి అభిమానులు “యువరాణి పరువు తీసేసావ్!” అని విరుచుకు పడుతున్నారు.