స్టార్ హీరో సీరియల్స్ లోకి….కర్మ కాలితే అంతేమరి..?

యస్.. హీరో నితిన్ సీరియల్స్ లో కనిపించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. హీరో నితిన్ కు సీరియల్స్ లో నటించాల్సిన అవసరం ఏముంది..బాగానే డబ్బుంది..ఆఫర్లు బాగానే వస్తున్నాయి. మరి..ఇలాంటి టైంలో సీరియల్స్ లో కి ఎందుకు..అని అనుకుంటున్నారా..?..నితిన్ సీరియల్స్ లోకి వచ్చే మాట నిజమే..కానీ, అది ఫుల్ టైం కాదు..కేవలం గెస్ట్ అపీరియన్స్.

యస్.. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో హీరో నితిన్ సందడి చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన లెటేస్ట్ గా నటించిన చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన లుక్స్ , పోస్టర్స్ , పాటలు..అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రా రా రెడ్డీ అంటూ వచ్చిన పాట యువత ను ఓ ఊపు ఊపేస్తుంది.

ఈ సినిమా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఈ సినిమా ద్వార దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజకీయ నేపథ్యంతో వస్తున్న ఈ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చే నెల అంటే ఆగస్టు 12న విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే నితిన్ సీరియల్స్ ద్వార అభిమానులకు ఈ సినిమాని చూడండి అంటూ సినిమాని ప్రమోట్ చేసుకోబోతున్నారట.

అంటే కొద్ది క్షణాల పాటు అలా సీరియల్‌లో కనిపించి..తన సినిమాను ప్రమోట్ చేసుకోబోతున్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే నితిన్‌ సినిమాకి మంచి పబ్లిసిటీ దొరికిన్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. దీని పై కొందరు నెటిజన్లు నితిన్ ని విమర్శిస్తున్నారు. నీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చివరకు సీరియల్స్ లోకి కూడా వస్తున్నావా..కర్మ కాలితే అంతే అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Share post:

Latest