ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. గణేష్ చతుర్థికి రెడీ అవుతున్న కొమరం భీముడి విశ్వరూపం!

తన అభిమాని హీరో ఏది చేసినా పండగ చేసుకుంటారు ఫాన్స్. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ శుభవార్త. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్ర RRR. ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అభిమానులను కట్టిపడేశాయి. కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసినదే కదా. సినిమా రిలీజై కొన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ న్యూస్ లో ఉంటుంది ఈ సినిమా అంటే అదంతా జక్కన్న మహిమే అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలో ఇంటర్ బ్యాంగ్ ఓ అద్భుతమని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జంతువులతో పాటు తెల్లవాళ్ళమీద విరుచుకుపడే సీన్ న భూతొ న భవిష్యతి. ఈ సినిమా చూసినవారు అంతత్వరగా ఈ సీన్ మరువలేరు. తాజాగా హాలీవుడ్ మేకర్స్ కూడా దీని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడటం మనకు తెలిసినదే. కాగా త్వరలో గణేష్ చతుర్థి రాబోతోంది కదా. గణేష్ విగ్రహాలను చెక్కే శిల్పులకు ఓ గమ్మత్తైన ఐడియా వచ్చింది. అదే జంతువులతో కిందికి దూకిన ఎన్టీఆర్ విశ్వస్వరూపం.

ఇపుడు ఆ సీన్ ని తలపించే గణేష్ విగ్రహాలు బయట దర్శనం ఇస్తున్నాయి. గణేష్ ఉత్సవం సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నందమూరి అభిమానులు గణేష్ ఉత్సవ పండుగ ముందే చేసుకుంటున్నారు. మీరు కూడా వాటిని తిలకించి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కాస్త తెలియజేయండి.