నాగార్జున కోడలి తో పెళ్లి..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేసిన అడవిశేషు..!!

సినీ ఇండస్ట్రీలో ఉన్న తరువాత గాసిప్స్ అన్నవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. సంబంధం ఉన్నా లేకున్నా ఏదో ఒక్క ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. మరి ముఖ్యంగా మొగుడి ని వదిలేసిన ఆడవాళ్ల పై ఇంకా ఇలాంటివి ఎక్కువుగా ఉంటాయి,. వాళ్ళు ఏదైన సినిమాలో కలిసి నటించినా..లేక క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించినా..సినిమాలో రొమాటిక్ సీన్స్ లో నటించినా..లేక వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగున్నా..ఇలా ఏం జరిగినా వాళ్ల మధ్య కిచ్ కిచ్ సంబంధం రన్నింగ్ అంటూ పుకార్లు పుట్టిస్తారు గాసిప్ రాయళ్ళు.

అలా పుట్టించిన ఓ పుకారు చాలా సిరీయస్ గా మారింది. ఎంతలా అంటే ఆ అమ్మాయి నేను మీ సినిమాలో నటించను అనేంతలా సీరియస్ అయ్యింది. ఆ అమ్మాయి మరెవరో కాదు..అక్కినినేని నట వారసత్వని కొనసాగిస్తున్న నాగార్జున మేనకోడలు సుప్రియ. అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి…తన నటనతో తో మెప్పించింది. సినిమాలో అమ్మడు నటన బాగున్నా కానీ హీరోయిన్ గా క్లిక్ అవ్వలేకపోయింది. దీంతో సినిమాలకు బ్రేక్ వేసి..ఇండస్ట్రీకి దూరమైంది.

కానీ, భర్త నుండి దూరమైయ్యాక..కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న ఈమె ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్షన్ స్కి సంబంధించిన పనులు చూసుకుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో చేతికి వచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే మల్టీ టాలెంటెడ్ అడవి శేషు సినిమాలో నటించిన ఈ అమ్మడు పై ఎవ్వరు ఊహించని విధంగా..వీళ్ళ ఇద్దరికి ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తన పెళ్లిపై వచ్చిన వార్తలపై హీరో అడవి శేషు స్పందించారు. సుప్రియతో పెళ్ళి అంటూ వస్తున్న వార్తల పై మండిపడ్డారు.

మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, తాజా ఇంటర్వ్యుల్లో మళ్ళి ఆయనకు ఇదే ప్రశ్న ఎదూరైంది. “మీ పెళ్ళి సుప్రియ తీ క్యాన్సిల్ అయ్యిందంటూ ఓ వార్త వైరల్ గా మారింది..దానికి మీ ఆన్సర్”..అని అడగ్గా..”మోస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది ..”అంటూ స్మైల్ ఇచ్చి వెళ్లిపోయారు. అయితే, వీళ్లు పెళ్ళి చేసుకోవాలి అనుకున్నది నిజం..కానీ, ఎందుకో ఆగిపోయారు..అందుకే అడవి శేషు ఇలా అన్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ డిస్కషన్స్ మొదలైయ్యాయి.