ఖరీదైన వజ్రం సొంతం చేసుకున్న తమన్నా.. మరి ఆమె ఆస్తులు తెలిస్తే షాక్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వన్నెతెగ్గని అందంతో గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగుతోంది.ఇక ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నా ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ల పైగానే దాటిందని చెప్పవచ్చు.కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ ఇండస్ట్రీ భాషల్లో కూడా తన దూకుడును కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల ఎఫ్ 3 సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ఇప్పటివరకు 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక తన పర్సనల్ జీవితం విషయానికొస్తే లగ్జరీగా గడిపే విషయంలో మాత్రం ఈమె ఏమాత్రం రాజీపడదు. ఖరీదైన ఇల్లు, కార్లు, ఆభరణాలు ఆమె విలాసవంతమైన జీవితానికి నిదర్శనంగా నిలుస్తాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఆస్తులు వివరాలు కూడా మనము ఒకసారి చదివి తెలుసుకుందాం.

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూ లో ఈమెకు రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ కూడా ఉంది. దాని పేరు బేవ్యు అపార్ట్మెంట్.. దీని విస్తీర్ణం 80,778 చదరపు అడుగులు.. అధునాతన ఇంటీరియర్ డిజైన్ తో అద్భుతంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారు .ఇక తమన్న ఆస్తి మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక ఈమె కారు కలెక్షన్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ – రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు.

ఇక ఈమెకు ఆభరణాలు అంటే చాలా ఇష్టం. అంతేకాదు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం కూడా ఈమె దగ్గర ఉంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలు. అయితే ఈ వజ్రాన్ని రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తమన్నాకు బహుమతిగా ఇచ్చినట్లు తమన్న స్వయంగా తెలిపారు. ఇక పలు యాడ్స్ ద్వారా సంపాదిస్తూనే , పలు వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.