ఎఫైర్స్, విడాకులు అంటూ టాలీవుడ్ పరువు తీస్తున్న సెలబ్రిటీ జోడీలు..!

మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని వివాహం చేసుకోవడం, లేదా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం..వివాహమైన తర్వాత కూడా ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోవడం ఇలా రకరకాల సంబంధాలు కలిగిన వ్యక్తులను మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. వీరి వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కూడా పోతోందని చెప్పవచ్చు.

ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో జంటలు క్యూట్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకొని తమ జీవితాన్ని కొనసాగిస్తుంటే మరికొన్ని జంటలు మాత్రం బాలీవుడ్ సినీ సెలబ్రిటీల రేంజ్ లో విడాకులు తీసుకుంటూ ఇంకొకరితో సహజీవనం చేస్తూ ఇండస్ట్రీ పరువు మొత్తం పోగొడుతున్నారు.
నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏం జరిగినా ఈ సినీ ఇండస్ట్రీకి మాత్రం పరిమితమయ్యేది..కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న నేపథ్యంలో భారత దేశ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఏ చిన్న విషయం జరిగినా సరే దేశవ్యాప్తంగా అది బాగా పాపులర్ అవుతూ ఉండడం గమనార్హం.

ఈ క్రమంలోనే కొన్ని సెలబ్రిటీ జోడీలు మాత్రం ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంతమంది హీరోలు దర్శకనిర్మాతల పేర్లు కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక మరొకవైపు గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీ జోడీలలో చాలా జోడీలు విడాకుల ద్వారా వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన ఈ జంటలు విడాకుల పేరిట అభిమానులను సైతం ఆవేదనకు గురి చేస్తున్నారు.. ఇకపోతే టాలీవుడ్ జోడీలు వార్తల్లో నిలుస్తూ ఉండడం.. మరి కొంతమంది నటీమణులు సహజీవనం చేస్తున్నామని డైరెక్ట్ గా చెప్పేయడం కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పరువు పోవడానికి ఇదే కారణం అని చెప్పవచ్చు. కొంతమంది మూడో పెళ్లి , నాలుగో పెళ్లి అంటూ వార్తల్లో నిలిస్తే మరికొంతమంది వారితో ఎఫైర్స్ మాకు ఉన్నాయి అంటూ ఇలా రకరకాలుగా వైవాహిక బంధానికి ఒక విలువ లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు తెలుగు పరిశ్రమను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే..ఇటువంటి జోడీల వలన తెలుగు సినీ పరిశ్రమ పరువు మొత్తం పోతోందని పలువురు ప్రముఖులు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.