ప్రముఖ కమెడియన్ సునీల్ భార్య ఇంత అందంగా ఉంటుందా… ఫ్యామిలీని చూశారా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నా సునీల్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పవచ్చు. ఆయన కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా విలన్ గా , హీరోగా కూడా తనలో ఉన్న ప్రతిభను ప్రేక్షకులకు చూపించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన పాత్రలో లీనం అయిపోయి ప్రేక్షకులను మెప్పించగలిగే సత్తా ఉన్న సునీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఇక అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సునీల్ ఇండస్ట్రీలోకి రావడంతోనే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సునీల్, ఆ తర్వాత నువ్వే కావాలి సినిమా ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే బాగా ఫేమస్ అయిన ఈయన మనసంతా నువ్వే, నువ్వు నేను చిత్రాల ద్వారా మరింత ఫేమ్ ను సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా ఏడాదికి 20 చిత్రాల్లో పైగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన సునీల్ వ్యక్తిగత విషయాలు మాత్రం చాలా మందికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా తన కుటుంబాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. వారికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకోలేదు..
ఇక సునీల్ వ్యక్తిగత విషయాలకొస్తే.. తన ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి కోల్పోతే.. తల్లి సంరక్షణలోనే సునీల్ పెరిగారు. ఇక తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసు సునీల్ కు మంచి స్నేహితులు కావడంతో అతడి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన వివాహం జరిగింది. సునీల్ భార్య పేరు శృతి. ఇక పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు సునీల్ తన భార్య ఫోటోలు ఎప్పుడు కూడా అభిమానులతో పంచుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం సునీల్ కు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం సునీల్ పలు చిత్రాలలో నటిస్తూనే హరీష్ శంకర్ రాసిన వేదాంత రాఘవయ్య సినిమా ద్వారా హీరోగా రానున్నారు. మరొకవైపు చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.