అందాల పూజాహెగ్డే ఈ సినిమాల విష‌యంలో చేసిన త‌ప్పులే ఆమెకు మైన‌స్ అయ్యాయా..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంచుకున్న ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలా తమ కెరియర్ను ముందుకు సాగించి.. ఎదిగిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. రెమ్యూనరేషన్ కంటే మంచి కథలను ఎంచుకోవడానికి హీరోయిన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక దీంతో వారి కెరియర్ పుంజుకుంటుందని నమ్మకం ఉంటుంది. అలాకాకుండా కథల విషయంలో తప్పులు చేశారంటే మాత్రం తమ కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి తప్పే చేసింది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. వాటి గురించి తెలుసుకుందాం.Shocker! He fails to save Pooja Hegde for scoring hat trick

పూజా హెగ్డే సినిమా షూటింగ్ సమయాలలో డేట్లు అడ్జస్ట్ చేయక కొన్ని సినిమాలను సైతం వదులుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో శృతిహాసన్ నటించిన పాత్రలో నటించే అవకాశం మొదట ఈమెకి వచ్చింది. కానీ కొన్ని కారణాల చేత ఆ అవకాశాన్ని వదులుకున్నది. ఇక నితిన్ హీరోగా వచ్చిన చిత్రం మాస్ట్రో. ఈ సినిమాలో కూడా ముందుగా తమన్నా నటించిన పాత్రలో నటించే అవకాశం పూజా హెగ్డే కు రాగా కొన్ని కారణాల చేత ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నది.Arrogant and threatening': Pooja Hegde alleges IndiGo staffer behaved  rudely | The News Minuteఇక ఆ తర్వాత బాలీవుడ్ ఛత్రపతి సినిమా రీమేక్ అల్లుడు అదుర్స్, శాకుంతలం, బాలీవుడ్ మూవీ అటాక్, గుడ్ బై వంటి సినిమాలను పూజా హెగ్డే వదులుకున్న చిత్రాలని తెలుస్తోంది. ఈమె వదులుకున్న సినిమాలలో కొన్ని బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయాయి. అయితే పూజా హెగ్డే కొన్ని సందర్భాలలో స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేయడంతో ఆమె అభిమానుల సైతం కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. ప్రస్తుతం ఈమె వరుస ప్లాపులలో చాలా సతమతమవుతోంది. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తోంది
మరి ఈ సినిమాతో నైనా ఈమె ఫేట్ మారుతుందేమో చూడాలి.