Agent Teaser రివ్యూ: అఖిల్ కు ఆ ఒక్కటే తక్కువ..?

అక్కినేని వారసత్వం పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో స్ధిరపడటానికి వచ్చిన నాగార్జున సన్స్ నాగ చైతన్య, అఖిల్..కెరీర్ లు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య హీరో గా ఓ మార్క్ చూయించినా ..ఇప్పటి వరకు అఖిల్..హీరోగానే గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయినా..అది అంతా పూజా హెగ్డే ఎగరేసుకు పోయింది. ఆమె అందాల ఆరబోతలకే సగం సినిమా హిట్ అయ్యింది అంటూ టాక్ వినిపించింది.

కాగా, ఇప్పుడు అఖిల్ అక్కినేని ఆశలు అన్ని తన నెక్స్ట్ సినిమా “ఏజెంట్” పైనే పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే..ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్ అని అర్ధమౌతుంది. ఈ సినిమా లో తన బాడీ లుక్స్ ఛేంజ్ చేయడం కోసం ..ఫుడ్ డైట్ మార్చేసి ..ప్రత్యేకమైన వ్యాయామాలు చేసి..అనుకున్నది సాధించాడు ఈ అక్కినేని వారసుడు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా లో హాట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌ గా నటిస్తుంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ స్పై థ్రిల్ల‌ర్‌ను ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ , సురేంద‌ర్ 2 సినిమా బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నారు. . ఈ సినిమా కి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే..మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఇందులో కీల‌క పాత్ర‌లో కనిపిస్తారు. రిలీజ్ అయిన టీజర్ , హీరో అఖిల్ కంటే కూడా మ‌మ్ముట్టి నే స్టైల్ గా, చాలా హ్యాండ్ సమ్ లుక్స్ తో కనిపించి ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ లా టీజర్ కి హైలెట్ అయ్యాడు.

ఇక అఖిల్ విషయానికి వస్తే , ఈ సినిమా లో అఖిల్ కరుడుగట్టిన దేశభక్తుడిగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది . బీస్ట్ లుక్‌ కూడా అదిరిపోయింది. కానీ, అఖిల్ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పుతున్నా..ఆ ఫీల్ మాత్రం రావడం లేదు. ఏదో బట్టి పట్టి చెప్పుతున్నాడు అనిపిస్తుందే కానీ..ఆ ఫీలింగ్ రావట్లేదు.. అది తప్పిస్తే..టీజర్ బాగుంది అంటున్నారు నెటిజన్స్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏజెంట్ సినిమాను ఆగస్ట్ 12న మూవీ రిలీజ్ కానుంది. మరి చూడాలి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా టాక్ తెచ్చుకుంటుందో..?