NTR 30, 31 రెండు సూప‌ర్ అప్‌డేట్లు… ఇది క‌దా ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించేది…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆయన హీరోగా రూపొందన్న్న 30, 31 చిత్రాలకు సంబంధిచిన అప్‌డేట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే, ఇవి ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాయా..ఎప్పుడు ఈ సినిమాల టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వస్తాయా అంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

టాలీవుడ్‌లో కాస్త వేగంగా సినిమాలు తీసే దర్శకుల్లో కొరటాల శివ కూడా ఉన్నారు. అందుకే ముందు ఆయన దర్శకత్వంలో తారక్ నటించబోతున్న 30వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాలకు ఇది మళ్ళీ నిరూపించుకోవాల్సిన సమయం. ఆచార్య భారీ
డిజాస్టర్‌గా నిలిచి కొరటాల క్రేజ్‌ను ఒక్కసారిగా కిందకు లాగేసింది.

దాంతో ఆయన కూడా కసిగా ఎన్టీఆర్ 30తో పాన్ ఇండియా లెవల్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
అయితే, విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు కొరటాల – తారక్ సినిమా నుంచి టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ వచ్చే దసరా పండుగనాడు రివీల్ కానుందట. అంతేకాదు, తాజా సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మేకర్స్ లాక్ చేసినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది మే 19న ఎన్టీఆర్ 30 సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే మే 20న తారక్ బర్త్ డే. ఈ సందర్భంగా ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ 30ని రిలీజ్ చేసి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ అని తెలుస్తోంది. అంతేకాదు, 2023 ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ 31 నుంచి టైటిల్‌ను రివీల్ చేస్తారని సమాచారం. ఇదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే.