నెట్టింట లీకైన Jr NTR ఫోన్ నంబర్ .. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడు తారక్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయనను హీరో గా కంటే కూడా ఓ అన్న లానే భావిస్తుంటారు ఫ్యాన్స్. తారక్ సినిమాల పరంగా ది బెస్ట్ అయినా..అందరు ఆయనను వ్యక్తిగతంగా నే ఇష్టపడుతుంటారు. సినీ బడా స్టార్స్ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

- Advertisement -

మొన్నటికి మొన్న కొటా శ్రీనీవాసరావు..ఓ ఇంటర్వ్యుల్లో స్వయంగా తారక్ ను పొగిడేశారు. ఆయన లాంటి నటుడు ఈ రోజుల్లో లేరని..ఖచ్చితంగా ఇలాంటి హీరో సినీ ఇండస్ట్రీలో ఉండాలి అని..ఏ రోల్ కి అయిన సెట్ అయ్యే విధంగా తారక్ తన బాడీని మార్చుకోగలరని..ఆయన చెప్పుకొచ్చారు. ఈయన మాటలు విని తారక్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

కాగా, రీసెంట్ గా RRR తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తారక్.,ప్రజెంట్ కొరటాల శివ తో ఓ సినిమా.. ప్రశాంత్ నీల్ తో మరో సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాదు. అయితే, తాజాగా NTR.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అభిమాని తో..తల్లి తో ఫోన్ లో మాట్లాడారు. “నీకు ఏం కాదు అని..నేను ఉన్నాను” అంటూ భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో, కాల్ రికార్డింగ్‌ను పీఆర్వోలు నెట్టింట్లో షేర్ చేశారు. అయితే, ఈ వీడియో లో తారక్ మాట్లాడుతున్న క్రమంలో ఫోన్ నెంబర్ ను స్క్రీన్ షాట్ తీసి…ఇదే తారక్ ఫోన్ నెంబర్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో చాలా మంది అభిమానులు NTR అనుకుని ఆ నెంబర్ కు కాల్స్ చేస్తున్నారట. కానీ, అది NTR ది కాదని..ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరు మీద ఉందని తెలుస్తోంది. అయినా అభిమానులు మాత్రం ఆగకుండా కాల్స్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

Share post:

Popular