ఆ నటుడి సెక్సువల్ హెరాస్మెంట్ తట్టుకోలేక సినిమాల‌నే వ‌దిలేసిన స్టార్ హీరోయిన్‌..?

అలనాటి నటి శోభన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటనతో పాటు నాట్యంలోనూ మంచి ప్రావిణ్యం వున్న నటి ఎవరన్నా వున్నారంటే అది శోభన ఒక్కరే. ప్రముఖ కళాకారులు లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది. ఇది హీరో నాగార్జున తొలి చిత్రం కావడం కూడా కాకతాళీయంగానే జరిగిపోయింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు అనే సినిమాలలో నటించి మెప్పించింది.

- Advertisement -

తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. ఇక చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది. ఒకప్పటి యువకులకు ఆమె కలల రాణి. మంచి డ్యాన్సర్ కావడంతో కళ్ళతోనే అనేక హావభావాలు పలికించేది. నాలుగు భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి, గ్లామర్ కు దూరంగా ఉంటూ, తనకు పరిధి ఉన్న పాత్రలను మాత్రమే పోషించి అగ్రహీరోలతో అనేక సినిమాలు చేసినా ఆమె మంచి విజయాలు సాధించింది.

ఇంత పేరు తెచ్చుకున్న ఈమె అనతికాలంలోనే సినిమా పరిశ్రమను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. దానికి కారణంగా ఆమెకు నాట్యం పట్ల వున్న మక్కువ వలెనే అని ఆమె చెప్పినా, ఆమె సినిమాలు మానేయడానికి ముఖ్య కారణం అప్పటి మీడియాలో వచ్చింది. అదేంటంటే, సినిమాల్లో హీరోయిన్ గా పనిచేసే సమయంలో ఆమెని ఓ హీరో సెక్సువల్ గా ఇబ్బంది పెట్టేవాడట. దాంతో ఇకపై తెలుగు సినిమాల్లో నటించనని తెగేసి చెప్పిందట.

అయితే శోభనను అంతలా ఇబ్బందులకు గురిచేసే హీరో పేరు మాత్రం కొన్ని కారణాలవల్ల మీడియా బయట పెట్టలేకపోయింది. కానీ ఇలాంటి విషయాల్లో నాటి నుండి నేటి వరకు హీరోయిన్స్ ని ఏపుకు తింటున్న ఆ హీరో పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఊహించుకోవచ్చు. ఆ మధ్యలో మాళవిక అనే హీరోయిన్ కూడా ఆ నటుడి బారినపడి తెలుగు పరిశ్రమ నుంచి పారిపోయింది.

Share post:

Popular