అక్కడ తాకాడు..యూట్యూబర్ ని చితకొట్టిన కరాటే కళ్యాణి..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయాయి. మన దగ్గరకు వచ్చి పరసనల్ క్వశ్చన్స్ అడగటం.. మితిమీరిన విధంగా బీగేవ్ చేయడం.. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ తో ప్రాంక్ వీడియోలు చేయడం సరదా అయిపోయింది. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి కానీ, హద్దు దాటి చేయడం ఏంటి అని మనలో చాలా మందే అనుకుంటుంటాం..తిట్టుకుంటుంటాం కూడా. కానీ సినీ నటి కళ్యాణి అలా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే ప్రాంక్ వీడియోలు చూడలేకపోయింది. కోపంతో మరి మితిమీరి సెక్స్ కామెంట్స్ చేసే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై మండిపడింది. అంతేనా చెంప చళ్లుమనిపించింది.

శ్రీకాంత్ రెడ్డి పేరు కి పెద్దగా పరిచయం అవసరం లేదు యూట్యూబ్ లో ప్రాంక్ పేరుతో నానా ఛండాలం చేస్తుంటాడు. అది ప్రాంక్ అంటారో ఇంకెమంటారో ఓ సారి యూట్యూబ్ లోకి వెళ్లి చూస్తే మీకే అర్ధమౌతుంది. సినీ నటి కరాటే కళ్యాణి గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి .. అతడి గూబ గుయ్యమనిపించింది. అంతేకాదు వెళ్తూ వెళ్తూ కరాటే కల్యాణి కొంతమంది అనుచరులతో వెళ్లి అతగాడిని చితకబాదింది. ఆమెతో వచ్చిన వాళ్ళు కూడా శ్రీకాంత్ రెడ్డిని దారుణంగా కొట్టారు.

ప్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు శ్రీకాంత్ చేతులు వేస్తున్నాడు అంటూ కారాటే కళ్యాణి ఫైర్ అయ్యింది. ప్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి.. మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడు అంటూ మండిపడింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్నాడు..నాతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడని..నా బోడ్డు పై చెయ్యి వేశాడని కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాంత్ కూడా కళ్యాణి ని కొట్టాడు.. దీంతో మరింత కోపానికి గురైన కల్యాణి శ్రీకాంత్ బట్టలు ఊడదీసి రోడ్లపై పరిగెత్తించి పరిగెత్తించి చితకొట్టింది. అయితే తాను ఏం తప్పు చేయలేదని..ఆమె తనని డబ్బులు అడిగిందని.. నేను ఇవను అన్నాను అని ఇలా చేస్తుంది అంటూ శ్రీకాంత్ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.https://www.facebook.com/watch/?v=564321458447804