బన్నీ బిగ్గెస్ట్ రిస్క్..మహేశ్ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా నా..?

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అభిమానులు ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకుంటారు. ఆయన తన లాస్ట్ చిత్రం పుష్ప తో పాన్ ఇండియా స్దాయిలో హిట్ కొట్టి ఫుల్ ఫాంలో ఉన్నాడు. సుకుమర్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక లైఫ్ నే మారిపోయింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు బడా బడా సినిమాలకు సైన్ చేయడమే కాకుండా..భారీ స్ధాయిలో పారితోషకం అందుకుంటుంది.

ఇక జూన్ మొదటి వారంలో పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ను లాంఛనం గా ప్రారంభించడానికి సుకుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సినిమా కధలో మార్పులు చేసి,, పుష్ప ది రూల్ ని మరింత హాట్ గా ఇంట్రెస్టింగా తెరకెక్కించడానికి రెడీ అయ్యారట. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిని దింపబోతున్నారట. కాగా, ఈ సినిమా తరువాత బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా అని అనుకుంటుండగా..అభిమానులను టెన్షన్ పెట్టే న్యూస్ బయటకు వచ్చింది.

మహేశ్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన ఏఆర్.మురుగదాస్ తో బన్నీ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ గా మారింది. మహేశ్ బాబుకి స్పైడర్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో బన్నీ మూవి ఏంటా అని అభిమానులు నిరాశ పడుతున్నారు. వద్దు బన్నీ ..అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. కానీ, ఇప్పటికే స్టోరీ విన్న బన్నీ..ఆయన తో అగ్రీమెంట్ పై సైన్ కూడా చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో నే తెరకెక్కనుందట. ఇది యాక్షన్ ధ్రిలర్ స్టొరీ గా తెలుస్తుంది. మరి చూడాలి బన్నీ దీని పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు ఇస్తాడో ..?

Share post:

Popular