మెగాస్టార్ మూవీ నుండి మాస్ రాజా ఔట్..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరు ఓ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.

మెగా 154 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని స్వయంగా చిరు కూడా చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆచార్య దెబ్బకు మాస్ రాజా వెనకుడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ షోగా మారింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.

మరి మెగాస్టార్ 154 మూవీలో తనకు ఎలాంటి పాత్ర దక్కుతుందో, దక్కినా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందో లేదో అనే డౌట్ రవితేజలో నెలకొందని.. అందుకే ఆయన ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.