ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అనుష్క..అంటే చాలా మందికి ఇష్టం. ఆమె చేసే నేచురల్ యాక్టింగ్…ఆమె ఎక్స్ ప్రేషన్స్ చాలా మంది జనాలకు నచ్చుతుంది. ఈ టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్ మోస్ట్ అందరి హీరోలతో జతకట్టిన అనుష్క..నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వెంకటేష్ హీరో గా నటించిన చింతకాయల రవి సినిమాలో..ఓ పాటలో ఎన్టీఆర్ మెరిసిన అది సినిమా క్రింద పరిగణించలేం. దీంతో ఇప్పటి వరకు వీళ్లిద్దరి పేరుతో ఒక్క సినిమా కూడా రాలేకుండాపోయింది.

అయితే, ఓ డైరెక్టర్ మాత్రం వీళ్ళ కాంబో సెట్ చేయడానికి ట్రై చేశారు ..కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. యస్.. అనుష్క తన కెరీర్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువుగా చేసింది. వాటిల్లో చాలా డిజాస్టర్ టాక్ దక్కించుకున్నాయి. ఆ లిస్ట్ లోకే వస్తుంది..”రుద్రమదేవి”. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై భారీ అంచానాలు పెట్టుకున్న అభిమానులను నిరాశపరిచాడు డైరెక్టర్. చారిత్రాత్మక సినిమా కావడంతో అందరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నారు కానీ..బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది.

నిజానికి ఈ సినిమాలో గోన గన్నా రెడ్డి పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ను అనుకున్నారట. గుణశేఖర్ ఆయన ను అప్రోచ్ అయ్యి కధ కూడా వివరించారట. కానీ సినిమా లో ఆ రోల్ చాలా తక్కువ టైం ఉండటంతో తారక్ రిజెక్ట్ చేసారట. ఇక ఆ తరువాత అదే రోల్ ని మహేష్ కు వినిపించారట..ఆయన వేరే సినిమా షూటింగ్ ల్లో బిజీ గా ఉండి ఆ పాత్రని వదులుకున్నారట. ఇక ఫైనల్లీ ఆ రోల్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు . సినిమా ఫ్లాప్ అయినా.. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. అలా ఆ రోజు మిస్ చేసుకున్న ఛాన్స్.. ఇప్పటి వరకు మళ్ళీ తారక్-అనుష్క కాంబో నే కుదరలేదు. మరి వీళ్లిద్దరి జంట కుదిర్చే డైరెక్టర్ ఎక్కడున్నాడో..?