నీహారిక స్వర్గం కామెంట్స్.. పరువుతీస్తున్న నెటిజన్స్..!!

నీహారిక కొణిదేల..ఆమె పెళ్లై ఇంటి పేరు మార్చుకున్న..అందరికి ఇలానే గుర్తుండిపోయింది. ముద్దుగా మెగా డాటర్ అంటూ పిలిచుకుంటారు మెగా ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో నీహారిక పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఆమె పెట్టే పోస్ట్లు.. బీహేవియర్..అలాంటివాటికి దారి తీస్తుంది. మనకు తెలిసిందే..సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే నీహారిక పై గత కొన్ని నెలలుగా ఏదో ఒక్క వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదట జిమ్ ట్రైనర్ తో మితిమీరిన అల్లరి వీడియోలు చేసిన అమ్మడుకి నెటిజన్స్ ఘాటు కౌంటర్లు వేసారు.

దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరమై..గప్ చూప్ గా కూర్చుంది. అయితే సడెన్ గా అందరికి షాకిస్తూ డ్రగ్స్ రైడ్ లో పట్టుబడింది. ఓ వారం రోజులో మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా నడించింది. ఆమె తప్పు ఉందో లేదో తెలియదు కానీ..ఓ సో కాల్డ్ బ్యాచ్ ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఆ తరువాత కొన్ని రోజులకి మళ్ళి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసింది ..మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. రీసెంట్ గా మదర్స్ డే సంధర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యుల్లో తల్లికూతుళ్లు పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే డ్రగ్స్ ఇష్యూ గురించి మాట్లాడగా..”మా అమ్మాయి గురించి మాకు తెలుసు. మా బావ గారు ఉన్నంత వరకు మాకు ఏం ప్రాబ్లమ్ రాదు” అంటూ నీహారిక తల్లి చెప్పుకొచ్చింది. కాగా రీసెంట్ గా నీహారిక పెట్టిన పోస్ట్ పై పలువురు నెటిజన్లు తప్పుడు అర్ధాలు తీస్తూ.. టూ మచ్ నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల తాజాగా జోర్దాన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూ..దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..అభిమానులతో పంచుకుంది. ఇక ఇందులో ఓ ఫొటోకు క్యాప్షెన్ ఇస్తూ..” నేను ఎక్క‌డ ఉన్న స్వ‌ర్గాన్ని వెతుక్కుంటాను’ అంటూ రాసుకోచ్చింది. అంతే కొందరు మెగా ట్రోలర్స్ ఆమె పై అసభ్యకర రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “స్వరగాని వెత్తుకుంటావ్.. స్వరగం ఇస్తావ్..”అని ఒకరు అంటే..‘ఇంకోసారి దొరికితే నిజమైన స్వర్గం కనిపిస్తుందిలే’ అంటూ మరొకరు ఆడేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం నిహారిక కి అండగ నిలబడి ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి నిహారిక అంటూ సపోర్ట్ చేస్తున్నారు.