ఆ హీరో కామెంట్స్ కి తమన్ హర్ట్..అలిగాడట..?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో హవా అంతా ఈయనదే. వరుస సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ..ఇచ్చిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..ఇండస్ట్రీలోనే నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ స్దానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయినా..ఆయన ఇచ్చిన సంగీతం సినిమాని నిలబెట్టింది. ఇంకొన్ని సినిమాలు అయితే కేవలం మ్యూజిక్ కారణంగా హిట్ అయ్యాయి. వాటిల్లో ఈ మధ్యనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “భీంలా నాయక్” సినిమా కూడా ఉండడం విశేషం.

అంతేకాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిచిన రాధే శ్యామ్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా..అది కాస్తా తుస్సు మనిపించింది..ఈ క్రమంలోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మహేశ్ సినిమా సర్కారు వారి పాటలో కూడా అంతే తమన్ అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా కళావతి సాంగ్ సినిమా సక్సెస్ 50 శాతాని తన ఖాతాలో వేసుకుంది. కీర్తి కాస్ట్యూమ్‌స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ..తమన్ బీట్..మహేశ్ ఎక్స్ ప్రేషన్స్ టూ గుడ్.

అయితే, తాజాగా సర్కారు వారి పాట సినిమా హిట్ అయిన సంధర్భంగా టీం ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో సినిమా హీరో మహేశ్ తో పాటి..డైరెక్టర్ పరశూరామ్..మిగత ఇండస్ట్రీ లో ప్రముఖులు హాజరైయ్యారు. కానీ, సినిమా సక్సెస్ లో సగ భాగం అయిన తమన్ రాలేదు. దానికి కారణం ఏంటా అని ఆరా తీయ్యగా..ఆయన ఇండస్ట్రీలో ఓ హీరో అన్న మాటలకి బాధపడ్డిన్నట్లు తెలుస్తుంది. ఆయన మ్యూజిక్ అందించిన సినిమా తో ఫ్లాప్ కొట్టిన హీరో..తాజాగా తమన్ “మ మ మహేశా” కాపీ ట్యూన్ పై సన్నిహితుల వద్ద మాట్లాడుతూ..తమన్ మ్యూజిక్ ని కించపరిచాడని..ఆ విషయం ఆ నోట ఈ నోట మారి..ఫైనల్ గా తమన్ చెవిన పడటంతో..ఆయన చాలా హర్ట్ అయ్యాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది