హమ్మయ్య.. శంకర్ సేఫ్..గట్టెక్కెసిన్నట్లేగా..?

ఇండస్ట్రీలో తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆచార్య..బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. దీంతో మెగా అభిమానుల మనసు ముక్కలైంది. ఏదో అనుకుంటే మరేదో జరిగింది అన్నట్లు.. సినిమా 100 కోట్లు దాటాలి..చిరంజీవి పేరు మారు మ్రోగిపోవాలి అనుకున్న అభిమానులకు కొరటాల నోట్లో మట్టి కొట్టారు. ఈ స్దాయి డిజాస్టర్ అవుతుందని కొరటాల శివ సైతం ఊహించలేకపోయుండచ్చు. కానీ రాజమౌళి అభిమానులు ఈ విషయాని ఎప్పుడో గెస్ చేశారు.

ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం రాజమౌళి తో సినిమా తీసిన ఏ హీరో అయిన..తన నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందే. అది ఎలాంటి హీరో అయిన సరే. తారక్, రవితేజ, నాని, రామ్ చరణ్, ప్రభాస్, వీళ్ళందరు ఆ లిస్ట్ లోకే వస్తారు. స్టూడెంట్ నెం 1 సినిమా నుండి.. నిన్న కాక మొన్న వచ్చిన RRR వరకు ఈ బ్యాడ్ సెంటిమెంట్ అన్ని సినిమాలకు అందరి హీరోలకు అప్లై అయ్యింది. పాపం..కెరీర్ లో భారీ డిజాస్టర్లు చూశారు ఈ హీరోలు రాజమౌళి కారణంగా. అలానే చరణ్ నటించిన ఆచార్య కూడా .. ఫ్లాప్ అయ్యింది. దీంతో అందరు బాధపడుతున్నా. ఓ డైరెక్టర్ మాత్రం పిచ్చ హ్యాపీ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

ఆయనే శంకర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్..రామ్ చరణ్ తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఆచార్య తో పోయింది కాబట్టి..ఇప్పుడు శంకర్ సినిమాకు లైన్ క్లీయర్ అయ్యిందని..లేకపోతే అసలే ఫ్లాప్ లతో అల్లాడిపోతున్న శంకర్ కు ఈ సినిమా కూడా ఫ్లాప్ పడితే కెరీర్ కి బిగ్గెస్ట్ మైనస్ అయ్యుండేది. కనీసం ఇప్పుడు హోప్స్ ఉన్నాయి. హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అంటూ శంకర్ సంబరపడుతున్నారట. మరి చూడాలి చరణ్ శంకర్ కి ఏ మాత్రం లక్ తెచ్చిపెడతాడో..