గుడ్ న్యూస్ చెప్పిన సాయిపల్లవి..పెళ్లి ఫిక్స్ అయ్యిందట..?

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉండచ్చు. కానీ వాళ్ల అందరిలోకి సాయి పల్లవి చాలా స్పెషల్. ఎందుకంటే.. అందరు హీరోయిన్లు డబ్బు కోసం ఎక్స్ పోజింగ్ చేయడానికి వెనుకాడరు. ఎలాంటి రోల్స్ కి అయినా సిద్ధపడతారు. కానీ సాయి పల్లవి టూ ఢిఫరెంట్. సినిమా స్టోరీ నచ్చితే డబ్బు ఎంత తక్కువ అయినా చేస్తుంది. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంది. ఎక్స్ పోజింగ్..వల్గారిటీకి దూరంగా..నటన డ్యాన్స్ కు దగ్గరగా ఉండే పాత్రలనే చూస్ చేసుకుంటూ వస్తున్న సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

మొన్న ఆ మధ్య ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చినా సాయి పల్లవి కి దక్కిన అభిమానం ఎలాంటిదో మనం అందరం కళ్ళారా చూశాం. ఆమెని మాట్లాడనీకుండా.. అరుపులు, కేకలతో..సాయి పల్లవి అంటూ నానా హంగామ చేశారు. అది వాళ్లకి ఆమె పై ఉన్న ప్రేమ. ఓ ఫ్యాన్స్ గా ఆమెకు ఇంతకన్న గొప్పగా చెప్పలేరు. అక్కడే ఉన్న ఓ డైరెక్టర్ సైతం .. సాయిపల్లవిని ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. అలాంటి అమ్మాయి ఈ భానుమతి. ఒక్కటే పీస్..మరో పీస్ చూడాలి అనుకున్న లేదు రాదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో బడా ప్రాజెక్ట్స్ ఏం లేవు. అమ్మడు కొత్త సినిమాలకి సైన్ చేయడం లేదు.

రానాతో విరాటపర్వం తప్పిస్తే..సాయిపల్లవి ఖాతాలో చెప్పుకోతగిన సినిమాలు లేవు. అవకాశాలు వస్తున్న ఆమె ఏదో రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తుంది. దీంతో అసలు మ్యాటర్ ఏంటా అని ఆరా తీస్తే..సాయి పల్లవి పెళ్లి ఫిక్స్ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సాయి పల్లవికి అప్పుడే పెళ్లి ఇష్టం లేదట. కానీ ఇంట్లో వాళ్ళ పెరంట్స్ ఫోర్స్ తో ఒప్పుకునిందట. అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదట . అబ్బాయి కూడా వాళ్ళ బంధువుల వాడే అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మరి చూడాలి పెళ్లి తరువాత సాయి పల్లవి సినిమాలు చేస్తుందో లేదో..?