భార్యాభ‌ర్త‌లు అలా చేస్తే బాగుంటుంది..వామ్మో..ఇంత డీప్ కామెంట్స్ వినలేం బాబోయ్..!!

బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్ ఖురానా..గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ ..అభిమానులను మెప్పిస్తూ..మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక తన భార్య తహీరా కశ్యప్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. బోల్డ్ మాటలతో కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో ఎప్పుడు నెట్టింట ట్రెండింగ్ లోనే ఉంటుంది. కాగా ఈ మధ్య తనకు కేన్సర్ సోకిందని ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టైంలో తాను జీవితంలో కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నాను అని కూడా చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది.

అయితే తాజా గా శృంగారానికి సంబంధించి బోల్డ్‌ స్టేట్‌మెంట్స్ తో నెట్టింట ఆమె మాటలు పెద్ద దుమారానే రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది సినీ స్టార్స్ శృంగార జీవితం గురించి చాలా ఓపెన్ గా..ఇంకా చెప్పాలంటే పచ్చిగా బూతు పదాలు వచ్చేటట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గానే A to Z చెప్పేస్తున్నారు. ఇది మానవ జీవితంలో ఓ భాగం అని సిగ్గుపడాల్సిన విషయం కాదని.. అందరు ఇలానే చేస్తారు అని చెప్పుతూ.. ఆరోగ్య దృష్ట్యా దానిపై కూడా పూర్తి అవగాహనతో ఉండడం మంచిది అని క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో నే ఇక రీసెంట్ గా తహీరా కశ్యప్ శృంగారం గురించి చేసిన బోల్డ్ కామేంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రీసెంట్‌గా ఆమె ప్ర‌ముఖ న‌టి శిల్పా శెట్టి హోస్ట్ చేస్తున్న కార్య‌క్ర‌మం ‘షేప్ ఆఫ్ యు’లో పాల్గొంది. చాలాసేపు సరదాగా గడిపిన వీళ్లు..ఆడవాళ్లకు సంబంధించిన విషయాలు చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే తాహిరా కశ్యప్ ఓ సంద‌ర్భంలో భార్యాభ‌ర్త‌లు శృంగారం గురించి ప్రస్తావిస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసింది. శృంగారం విష‌యంలో ఎలా ఉంటే బావుంటుంద‌ని తాహిరా క‌శ్య‌ప్‌ తన . భ‌ర్త ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి చేసే శృంగారం గురించి వివరిస్తూ మైండ్ బ్లాకింగ్ అయ్యేలా టూ బోల్డ్‌గా మాట్లాడింది. శృంగారం అంటే అది ఏదో బూతు కాదు అని.. అది కూడా ఓ వ్యాయామం లాంటిదేనని ..దానికి మించిన బెస్ట్ వర్క్ అవుట్స్ లేద‌ని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఒకానోక సంధర్భంలో ఆమె శృంగారం గురించి కూసింత డీప్‌గానే మాట్లాడింది. శృంగారం చేయ‌డం వ‌ల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని..మైండ్ రీఫ్రెష్ అవుతుందని..ఎక్కువ క్యాల‌రీలు కరుగుతాయని.. ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ఓ సినీ సెల‌బ్రిటీ శృంగారంపై ఇలా డీప్ హాట్ గా మాట్లాడంతో ఆ వ్యాఖ్య‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.